భారతదేశంలో, ఆ రోజు కాలెండర్లో 1969 వ సంవత్సరం జులై నెల 20 చూపిస్తోంది. అలాగే సరిగ్గా అదే రోజు అమెరికా చెరిత్రలో ఓ నాటకానికి తెరదించే ప్రయత్నం మొదలైంది. ఆనాటి యావత్ అమెరికా ప్రజలనే కాకుండా ప్రపంచ జనాభానే మభ్య పెట్టి ఆకాశానికి నిచ్చెనను వేసి చంద్రునిపై అమెరికా అంతరిక్ష వ్యామగోములైన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మరియు బజ్ అల్ డ్రిన్ పాదం మోపిన (అబద్దపు) నాటకాన్ని అత్యంత రసవత్తరంగా నాసా రచించడమే కాకుండా రెండున్నర గంటలు ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీల ద్వారా ఆనాటి జనాభా చెవులలో క్యాబేజీ అంత పూలు పెట్టి మరీ చూపించే సాహసం చేసిందంటే, అది విని పుస్తక పుటల ద్వారా చదువుకుని వారు చెప్పిందే వేదంగా తలచి తప్పుడు సమాచారాన్ని జీర్ణించుకో .. అంటే నేనేమన్నా టాటా డుకొమో వాడటం లేదనుకుంటున్నారా..
అలనాడు సర్ ఐజక్ న్యూటన్ ప్రశ్నించినట్లు, ఆపిల్ క్రిందకే ఎందుకు పడాలి? తరహాలో నేను వీరి భూటకపు ప్రయాణ కార్యక్రమాన్ని వితండంగా .. ఈళ్ళు నిజ్జంగానే ఆడకి పోయ్యారా లేక ఇదంతా హాలీఉడ్ స్టూడియోలో తీసిన సినిమానా అని అనను .. కానీ ఈళ్ళు ఎళ్ళింది మాత్రం చెంద్రునిమీదకు కాదు కానీ ఈళ్ళు ఏళ్ళింది భుధ గ్రహం మీదికి అంటాను, కాదంటారా!! ఎక్కడికెళ్ళరో అనేది ఋజువు జేసుకునే భాద్యత ఆళ్ళదే గందా!! ఎలా అంటారా, మన భారతదేశం చట్టం ప్రకారం నిందారోపణ జేయబడ్డవానిదే నిరూపించుకునే భాద్యత. అంతవరకూ వానిని ముద్దాయి అంటారు. అలాంటి ముద్దాయిపై పడ్డ అపవాదుని తొలగించుకుంటూ నిర్ధోషిగా విడుదలవ్వాలంటే మరి ఎవ్వరు చెయ్యాలా!! మన నాసాఓళ్ళే చెయ్యాల.. గేటంటరు? ఇక అసలు ఇషయాని కొస్తే, మనోళ్ళు అస్సలు చంద్రునిపైకి పోలే.. అని సానామంది గోటికాడ నక్కలా కూస్తానే ఉన్నారు. వాటిల్లో కొన్ని ప్రశ్నలు వాటి జవాబులు (తేలికగా ఉండేవి మాత్రమే) మీకోసం ఇక్కడ ఇలా.. ఇక్కడ ప్రస్తావించని చాలా (ఎన్నో) ప్రశ్నలకు సమాధానాలే లేవు. అయితె..ఈ క్రింది ప్రశ్నలు జవాబులేవి?
1) ఆ రోజు టెలీకాస్ట్ అయిన ప్రసారంలో చంద్రుని ఆకాశంలో ఉండాల్సిన నక్షిత్రాలు ఏమయ్యాయి? ఏం చంద్రుని ఆకాశం భూమి ఆకాశం ఒక్కటి కాదా!!
నా జవాబు) భహుసా ఈ సినిమా డైరెక్టరు గారికి మన విఠలా చార్యుడు గారు పరిచయం లేరెమో.. అంతే కాకుండా ఈ డైరెక్టరు గారికి డిస్కో లైట్ల గురంచి తెలియదేమో!! దీనికి సమర్దనగా ఉన్న వివరణ ఏమిటంటే, ఆరోజున వ్యామగోములు వాడిన కెమెరా ఎక్కడో ఉన్న నక్షిత్రాలను జూమ్ చేసి చూపలేకపోయింది కనుక తప్పు వీళ్ళు తీసుకెళ్ళిన కెమెరాదైతే మొత్తం వ్యవహారమే భూటకం అనటం ఏమాత్రం భావ్యం? అందుకని యదవ నాటకాలాడకుండా సెప్పింది ఇని ఊరుకో!! అంతే గానీ అదిలేదు ఇది లేదు అన్నావ్వంటే ఒంగో బెట్టి పాలు ఇతుకుతా బిడ్డా!!
2) Apollo 11 అనేది వీరి అంతరిక్ష నౌక పేరు. ఈ నౌక చంద్రునిపై దిగేటప్పుడు కొన్ని వీడియోలను తీసింది. వాటిల్నే మన అమెరికా ప్రభుత్వం భద్ర పఱచింది. కానీ విచిత్రం ఏమిటంటే భద్రతా కర్మాగారం లోంచి వీటిల్నిఎవ్వరో దొంగలించారు. అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం యొక్క వీడియొలు పోయాయంటే, దొంగిలించిన వారికి ఒఱిగేదేమిటి? దొంగిలించిన వారు ఏ ఉద్దేశ్యంతో దొంగ తనం చేసారంటారు? అస్సలీ దొంగతనం వెనకాల ఎవ్వరికీ అసలైన ప్రయోజనం? మొత్తం 700 టేపుల్లో 698 టేపులు ఎత్తుకు పోయ్యారంట!! ఓ రెండు మాత్రం వదిలేసారంటే.. దాని వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది?
నా జవాబు) ఏముంది, సింపుల్.. సాక్ష్యాలు పోయ్యాయంటే ఒక్క మాటతో అబద్దాన్ని ఱుజువు చెయ్యాల్సిన అవసరం ఉండదుగా !! ఓ!! చెప్పడం మరిచాను, పోయ్యాయనుకున్న 698 వీడియోలలో ఓ వంద వరకూ దొరికాయంట. ఎక్కడనుకున్నారు వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్ అనే నగరంలోని కర్టైన్ అనే యూనివర్సిటీలోని ఫిజిక్స్ పాఠాలు చెప్పే ఓ పెద్ద సెమినార్ హాల్ యొక్క కుర్చీల సీట్ల క్రింద!! ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయ్యాలి. ఈ సెమినార్ హాల్ చాలా కాలంగా మూత పడి ఉందంట. అయినా నాకు అర్దం కాక అడుగుతాను అస్సలీ సెమినార్ హాల్ ని ఎందుకు మూసేసినట్లు? ష్.. ఇక్కడ మీరు ప్రశ్నలు అడగకూడదు.
3) ఈ తతంగంలో మనుష్యులే కాకుండా వారికి తోడుగా కొన్ని రవాణా వాహనాలు అక్కడ వీరికోసం అమర్చబడ్డాయి. నిజమే అనుకుందాం. మనుష్యులు నడిచినప్పుడు పాదాల గుర్తులు మాత్రం అచ్చులుగా పడతాయా!! మరి అక్కడ ఉపయోగించిన బ్యాటరీ కార్లు వాటి చక్రాలు వాటి గమనాన్ని ఉద్దేశ్శించే విధంగా ఎలాంటి గుర్తులు మిగల్చ లేదంటే ఏమనుకోవాలి? నమ్మకం కుదరటం లేదు కదా .. ప్రక్కనే ఉన్న చిత్రంలో ఉన్న వెహికిల్ చక్రాల మధ్యలో చూడండి ఏమైనా గుర్తులు కనబడుతున్నాయా??
4) ఆ రోజుల్లో ఉన్నటువంటి శాంకేతిక పరిఙ్ఞానంతో అంతరిక్షంలోకి వెళ్ళి, చెంద్రునిపై దిగి, తిరిగి రావడానికి ఉన్నటు వంటి అవకాశం 0.0017%, అంటే ఇది virtually impossible. అటువంటిది నాసా ఐదు సంవత్సరాల వ్యవధిలో దాదాపు డజన్ మంది వ్యామగోముల్ని అంతరిక్షంలోకి పంపించడం చేసిందంటే, నలభై సంవత్సరాల తరువాత టెక్నాలజీ ఇంతగా అభివృధి చెందిన సమయంలో ఒక్క సారి కూడా అటువంటి ప్రయత్నం చెయ్యకుండా, ఎప్పుడో మా తాతలు నేతులు నాకారు ఇప్పుడు మీరు మా మీసాలు వాసన చూడండి అంటే ఎలా నమ్మాలి?
ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో.. మరి చదివే తమరేమంటారు?
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
12 కామెంట్‌లు:
బానే ఉన్నై మీ ఆరోపణలూ సాక్ష్యాలూ. :)
నిజమె .. ఈ నలబై సంవత్సరాలలొ మళ్ళీ ఎందుకు పంపలేదు? ఇప్పుడు వున్న టెక్నాలజితొ ఇంకా ఈజి కదా.. సర్లెండి మనవాళ్ళు వెళ్ళి నప్పుడు అక్కడ అమెరికా జెండా వుందొ లేదొ చూసి వస్తారు.. అప్పటిదాకా కాస్త ఒపికపట్టండి .
అవును సార్. మన చంద్రయాన్ కూడా భ్రమ. ఒట్టి భ్రమ. మీరు (రాత్రి పూట) బయటకి వెళ్ళి చూస్తే కనపడుతాయే నీలి ఆకాశమూ, మబ్బులూ, రాత్రిపూట చందమామ, మిణుక్కు మిణుక్కు మనే నక్షత్రాలూ అవన్నీ ఏంటనుకుంటున్నారు? గ్రాఫిక్స్!
ఈ కాన్‌స్పిరసీ థియరీస్ కొత్తవేం కావు. ఆ ప్రశ్నలన్నిటికీ నాసా ఎప్పుడో సమాధానాలిచ్చింది. చంద్రుడిపై వాళ్లు కాలు మోపటం నిజమైనా కాకపోయినా, ఆ పరిశోధనల కోసం నాసా సృష్టించిన టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచంలో అందరి జీవితాలనీ ప్రత్యక్షంగానే ప్రభావితం చేస్తుంది. అసలు - మూన్ లాండింగ్ అనేది హోక్స్ అయినట్లైతే రష్యన్లు ఆ విషయాన్ని అప్పుడే రచ్చ చేసేసుండేవారు.
naaku maatram vaalla technology meeda baaga nammakam......
40 years kinda technology leda.......hahahhahahahha
ఈ ఆరోపణలే కాక ఇంకా మరిన్ని ఆరోపణలు కొన్ని యేళ్ళ ముందు నేను చూశాను ఒక చోట. ఆ చోటు - ఇస్కాన్ టెంపుల్, బెంగళూరు. చంద్రుడిపై నీడలు, ఒకే ఫోటోలో ఒక చోట పొడుగ్గా, మరోచోట పొట్టిగా ఉన్నాయని, వెలుతురు లేకుండా ఫోటోలెలా తీశారనీ వగైరా వగైరా..
I red many articles about APPOLO 11. Russia already said its TRASH. Now Bhavadeyudu.
USA, start point for many cock and bull stories. This is the one.
Even, I saw many movies, "The world goes to Danger End, then Americans secures"
ఆకులో ఆకు అనే సామెత విన్నారా. అసలు కంచెం అయితే ఈ బ్రామ్మలు తమకు అనుకూలంగా మార్చుకుంది కొండంత. పన్నెండువేలున్న పద్యాలున్న భారతాన్ని లక్ష పద్యాలకు పొడిగించారు. అంతకన్నా తక్కువున్న రామాయణాన్ని ఇరవైనాలుగు వేలకు పెంచారు. అంతా వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నవే. దేవుడు వాళ్ళసొత్తు. దేవుడి దయ కావాలంటే ముందు వీడికి డబ్బులివ్వాలి. యుద్దం చేసేది రాజు, సైనికులు, ప్రజలైతే గెలుపు క్రెడిట్ మాత్రం వీళ్ళు కూర్చుని చేసే యాగానిదే. గజనీ దాడి చేసినప్పుడు వీళ్ళ మాటలు నమ్మి జనం తిరగబడకుండా ఉండిపోయేసరికి గజని మహమ్మద్ కు ఉన్న రిస్కల్లా కేవలం నరకడానికి పట్టిన సమయం మాత్రమే. ఇంకాచాలా ఉంది. త్వరలో దీని గురించి వ్రాయబోతున్నా.
sorry posted in your blog by mistake. pls remove the first comment
soon i wil upload the video conspiracy theory... it makes everythings clear that americans did not land on moo.
pls see. http://public-court.blogspot.com
మీ విశ్లేషణ మరియు వివరణ చాలా బాగుంది.కాని పైన మిత్రులు చెప్పినట్టు రష్యా వాడికి అమెరికా వాడంటే మంట.కాబట్టి తరువాత రష్యా వాళ్ళు పోయొచ్చిన్నప్పుడైనా ఇది బయట పడేదే కద???ఆలోచించండి??
ఇక అప్పుడెప్పుడో పీకాడు కదా, మరి ఇప్పుడు మళ్ళి ఎందుకు పీకలేదంటే అది వాడి వీలు మరియు అవసరం మీద ఆధారపడి ఉంటాయి.(అన్నమయ్య సినిమాలోని డైలాగ్ .. "రాజుగారిమీద కవిత్వం ఏం చెప్పాలి అంటే ... నువ్వది పీకావో, నువ్విది పీకావో, మీ తాతలు,తండ్రులు చాలా పీకారో...........అని ప్రాసతో చెప్పు" అన్నట్లు సరదా కోసమే ఈ డైలాగ్). అలా చేసిందే చేస్తున్నాం కాబట్టి మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంటే అమెరిక వాడెప్పుడొ అభివృద్ధి చెంది మన మీద(ప్రపంచం లోని కొన్ని దేశాల పైన) పెత్తనం చేస్తున్నాడు.
"ఒంగో బెట్టి పాలు ఇతుకుతా బిడ్డా"
డైలాగు బాగుంది కాని ఎక్కడో విన్నట్టుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి