25, మార్చి 2009, బుధవారం

ఒక్క మగాడు – ఈడికి ఈడే సాచ్చి : – An introspect

క్రిందటి పుట లో చెప్పినట్లుగా నేను సదురు మగాడి గారిని యాదృశ్చికంగా కలవడం జరిగింది. అలా వారితో కలిసి ఛాయ్ త్రాగే అవకాశం వీరు నాకు కలిగించారు. ఇక అసలు విషయం లోకి వద్దాం. సీన్లో నేను సదురు మగాడు ఎట్ ఛాయ్ సెంటర్..

మగాడు : ఏయ్ చిచ్చా!! దో ఛాయ్, చార్ సమోసా ఔర్ ఆఠ్ బిస్కూట్  లావ్ రే.. బిస్కూట్ పెహలా.. అదిసరే గానీ అడకటం మరిచినా .. నువ్వు ఛాయ్ తాగుతావు గందా!!??

నేను : ఆర్రేరే.. చాయ్ దేముంది.. త్రాగుతా..

మగాడు : గది సరేగానీ.. ఏందీ ఈ మధ్య అమ్మాయిల గురుంచి .. ఏదేదో కూస్తున్నావంట

నేను : అవునండి.. మహిళాల్లో.. (మధ్యలో దూరుకుని..)

మగాడు : నువ్వెవ్వరి గురించి రాస్తే నాకేంటి గానీ..

నేను : దాని వలన మీ అక్క గానీ చెల్లి గానీ భాధ పడ్డారా!!

మగాడు :  హా!! హా!! మనకు చెల్లి గిల్లి .. గసుంటోళ్ళు ఎవ్వరు లేర్.. పురిట్లోనే పిల్ల పుడతాందని తెలిసి మా అయ్య అప్పుడే తీసించేసిండు. మనం బిందాజ్.. దోస్తానలతో మంచిగా ఎంజాయ్ చెయ్యటమే..

నేను : నిజమా!! (ఆశ్చర్యపోవడం నా వంతైంది)

మగాడు : గది సరేగానీ.. ఏందీ గెప్పుడు చూసినా అమ్మాయిల గురించి పీకుడేనా.. మన మొగోళ్ళ గురించి కొంచం కూడా కూసుడు లేదా..

నేను : సరైన మగాడు దొరకలేదండి. దొరకగానే ఆ పనిమీదే ఉంటాను..

మగాడు : ఆడెవడో దొరకడం లేదే అని ముడుసుకుని కూచ్చోకపోతే.. నేను లే.. నన్ను సేసుకో..

నేను : ఏంటి చేసుకునేది?

మగాడు : గదే బై.. తుంటర్వూ..

నేను : ఓ.. అలా వచ్చారా.. సరే.. మీతోనే మొదలు పెడతాను

మగాడు : గది గిప్పుడు నచ్చినావ్ నాకు .. మర్ద్ హోతో మేరే జైసా..

..

ఇంతలో సమోసా వచ్చింది.. అవి తింటూ, నేను నా పనిలో పడ్డాను..

..

నేను : మరి ఇక అసలు విషయానికి వద్దాం. మీరు నా ఇండాలు గురించి చదివారా!!

మగాడు : లేదు బై.. గానీ, మనకున్న కొద్ది మంది దోస్తానాలోని ఓ పోరి సదివిందంట.. తెగ నవ్వుకుని, నీ గురించి సెబుతాంటే ఇని, నీకు సానా కిలాసు పీకాలని గిట్లొచ్చినా..

నేను : నాకా !! క్లాసా!! ఎందుకంటారు??

మగాడు : బై.. నీకు తెల్వదనుకుంటా.. అమ్మాయిలు చానా మంచోళ్ళు. ఆళంత మెత్తని మనసున్న మనుషులు నీకెక్కడ కనబడరు. నువ్వన్నట్లు ఆళ్ళని పడేయ్యాలంటే ఆళ్ళు చేశే ఏషాలు కాదు, మనం మగాళ్ళు చేసే పనులే..

నేను : అంటే.. నాకు అర్దం కాలేదు.. అబ్బాయిలు వాళ్ళ వెంట పడేది వాళ్ళ ఎక్స్ ‍పోజింగ్ వల్ల కాదంటారా..

మగాడు : ఖచ్చితంగా.. ఆళ్ళు ఒక్కడితో డిసైడ్ అయ్యారంటే, ఎంత మంది ఆళ్ళ చుట్టూ తిరిగినా ఏదో టైమ్ పాస్ అనుకుంటారే తప్పితే.. మిగిలిన ఇషియాలలో సానా స్టిట్టు. గానీ మనదేముంది, ఇప్పుడు ఇది.. కాసేపైన తరువాత మరొక్కత్తి.. ఆ తరువాత ఇకొక్కతి. ఇలా ఎంత మంది కావాలంటే అంత మంది .. మనల్ని ఆడిగేదెవరు చెప్పు..

నేను : అంటే అర్దం కాలేదు .. కొంచం వివరంగా చెబుతారా..

మగాడు : అలా అడిగావ్ బాగుంది. సరిత్రలో ఒక్క ఆడదానికి మాత్రమే కట్టుబడ్డ మగాడికి పట్టిన గతి ఏంటో తెలుసునా..

నేను : లేదండి..

మగాడు : పోని అట్లాంటి మగాళ్ళు ఎవ్వరో చెప్పగలవా..

నేను : అంటే.. పురాణాలలో ఒక శ్రీరాముడు.. చరిత్రలో ఒక్కరేమిటి చాలా మంది ఉన్నారు..

మగాడు : ఈళ్ళందరూ అస్సలు నిజంగా ఉన్నారో లేదో తెల్వదు గానీ.. నాకు తెలిసినంత వరకూ ఓ మజ్నూను చూడు.. అలాగే ఓ దేవదాసుని చూడు.. ఇలాంటి వాళ్ళ గతి ఏమైంది? పోరీలేమో మాంచిగా పెళ్లిళ్ళు సేసుకుని కాపురాలు సాగించటంలే.. గానీ ఆళ్ళు పెళ్ళిళ్ళు సేసుకున్న తరువాత గీ పోరగాళ్ళని పిలిసి మంచిగా రెండు ముక్కలు సెప్పి.. అరే బై ఇకమీద నువ్వు నేను దోస్తానా చేద్దాం అంటే.. ఇనక రోడ్డెక్కి గోల సేసేది ఎవ్వరు?  

నేను : ఆ!!! (ఇందులో ఈ యాంగిల్ కూడా ఉందా..)

..

ఇంతలో ఛాయ్ వచ్చింది.. ఒక్కో బెస్కెట్ వేడి వేడి ఛాయ్ లో ముంచుకుని తాగుతుంటే.. ఆహా.. అనిపించింది.. ఇంత కాలం ఈ రుచిని ఎలా మిస్ అయ్యానా అనిపించింది..

..

మగాడు : పాపం.. ఆళ్లు ఏ పరిస్తితులలో అట్లా సేసిండ్రో అని ఎవ్వుడైనా ఆలోసిస్తుండ్రా.. గంతెందుకు బై.. మాగాడైతే ఎంత మంది పెళ్ళాలనైనా ఉంచుకోవచ్చా.. కానీ ఆడది మాత్రం ఒక్కడికే పరిమితం అవ్వాలా.. ఇలా సెప్పింది ఎవ్వర్? మనం మగాళ్ళం కాదా.. పాపం ఆళ్ళు కూడ పానీపురి కట్లెట్ తింటాండారు కదా..

నేను : పానీపురి కట్లెట్ !!! ???

మగాడు : అదే.. ఉప్పు కారం అని నా ఉద్దేశ్యం. ఆళ్ళకీ కొద్దో గొప్పో కోర్కెలు ఉంటాయి గందా.. మరి ఆటిల్ని గురించి ఎవ్వుడైనా పట్టించుకుంటుండా.. లేదే..

నేను : అవుననుకోడ్రి.. ఛా.. ఏందిది.. నేనుకూడా మీలాగే మాట్లాడుతున్నాను..

మగాడు : హా.. హా..

నేను : అంటే తప్పంతా మగాళ్ళదే అంటారా..

మగాడు : గిక్కడ తప్పొప్పులగురించి మనకు అనవసరం బై.. నేను సెప్పొచ్చేది ఏంటంటే.. అమ్మాయిలు సానా మంచోళ్ళు ఆళ్ళ గురించి తప్పుగా రాయ మాక. ఆళ్ళంత అమాయకమైనోళ్ళు మనకు దొరకరు. అమ్మాయిల బాచ్ అంతా అంతే.. శివయ్యని అంటారే.. అదేందది..

నేను : భోళా శంకరుడు అని..

మగాడు : అదే.. అచ్చంగా ఈళ్ళు అంతే.. వఠ్టి భోళ్ళా మనుషులు.. ఈళ్ళ గురించి నీకు తెల్వదు బై.. నువ్వెప్పుడైనా ఏదైనా పోరిని పటాయించి నావా..

నేను : అబ్బే లేదండి..

మగాడు : ఒక వేళ్ళ పటాయించి నావనుకో.. ఎలా పటాయిస్తావ్..

నేను : నేనెప్పుడూ పటాయించలేదే..

మగాడు : ఓ చిట్కా సెబుతా ఇనుకో.. ఆళ్ళని పొగుడుతూ ఓ నాలుగు లైన్ల కవిత్వం రాయి అంతే.. పోరి ఖలాస్.. ఖుష్ అయ్యి నీ ఒల్లో వాలిపోద్ది

నేను : నాకా .. కవిత్వమా.. రాదే..

మగాడు : వచ్చేదేముంది.. అదేదో సినిమాలో నాగార్జున కస్టాలు పడతాడే.. రాజు గారిని నువ్వది పీకావో.. నువ్విది పీకావో అని కవిత్వం సెప్పలేదని.. ఆలెక్కలో నువ్వు కూడా ప్రయత్నం సెయ్యి..

నేను : అంటే కవిత్వం లో కూడా పీకడం చెయ్యాలా..

మగాడు : ఓ పది పదాలు సెబుతా ఇనుకో.. అందం సెంద్రుడు.. కోపం సూరీడు.. నవ్వు ఎన్నెల.. దూరం ఇరహం.. పువ్వులు సరసం.. ఇలాంటి వాటిల్ని వాడేస్తూ ఎదో ఒకట్ రాసేయ్.. గంతే నిన్ను గుడ్డిగా నమ్మేస్తది.. అంతే.. నీ పని గట్లా ముగించుకో ఆ తరువాత పిలేటు పిరాయించేయ్..

నేను : పాపం కదండీ..

మగాడు : కొంత కాలం ఏడుస్తారు.. ఆ తరువాత కాలం మనల్ని మర్చి పోయేట్టట్టు సేస్తాది. ఆళ్ళకు బొత్తిగా లోకం తెల్వదు బై.. ఎవ్వురైనా గింత మంచిగా మాటాడారో గంతే.. ఆళ్ళు మనోళ్ళనుకుంటార్.. ఎవ్వుడు మంఛోడో.. ఎవ్వడు దొంగ నాయాలో ఈళ్ళకి తెల్వదు. అంతెందుకు బీహార్ లో మొన్నామధ్య చదువులు సెప్పే ప్రొఫెసరు సారు లేడు .. గదే బై.. మతుక్ నాద్ చౌదరి.. గాడు సూడు.. మంచిగా పెళ్ళి సేసుకుండు.. ఇద్దరు పిల్లల్ని కనిండు.. సాలేగాడు .. గీ వయసులో మరో పోరిని పటాయించినాడు. మరి ఆ పిల్ల తెలిసి తెలిసి గీ ముసలోడ్ని ఎలా సేసుకుందంటావ్? అన్నీ మాయ మాటలు బై..

నేను : అవుననుకోండి..

మగాడు : అనుకో.. గినికో .. అది తీసి పక్కల బెట్టు.. గీరోజుల్లో పెళ్ళైన ఆడోల్లు ఎంత మంది ఉద్యోగాలు గట్రా సేత్తాండ్రు.. గాళ్ళు మాత్రం పొద్దుగాల్నే లేవాల్నా.. మొగుడుకి నాస్తా సేసి పెట్టాల్నా.. ఉన్నదేదో కూతంత తినేసి పొలో మంటూ ఉద్యోగానికి పోవాలా .. మళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత.. ఇంటెడు చాకిరీ చెయ్యాల్నా వద్దా.. పోనీలే చేదోడుగా ఉంటాదని పని పిల్లని పెట్టుకుందనుకో మన మగాళ్లం ఎట్టా రియాక్ట్ అవుతాం..

నేను : ..

మగాడు : బోడి అఫీస్ లో పొడిచేసిందేంటంట.. ఇంట్లో పనిపిల్లని పెట్టుకున్నావ్.. దానికి జీతం దండగ..

నేను : ..

మగాడు : అదంతా వద్దు బై.. ఏనాడైనా మన మగాళ్ళు.. నాజీతం ఇంత.. నేను ఈ జీతంతో ఫలానా ఫలానా పనులు చేస్తున్నా అని పెళ్ళాలకి సెబుతారా.. పైగా .. సంపాదీంచే పెళ్ళాం ఉంటే.. దాని జీతం కూడా నాకే కావాలంటాడు..

నేను : ..

మగాడు : ఉల్టా.. ఏదైనా కొనుక్కోవాలంటే పర్మీషన్ లేందే ఊరుకోమాయే.. మరి ఇంతగా ఇంసిత్తున్నమే.. ఏనాడైనా .. ఒరేయ్ నాయాల్ది.. అని మనల్ని తిట్టిండ్రా.. లేదే.. ఆడెవడో సెప్పినాట్లు.. ఆడది అమ్మోరు ఆవు అన్నీ ఒకే రకానికి సెందినోళ్ళు.. గడ్డి లాంటి పనికి రాని వాటిల్ని కూడా తిని పాలల్లాంటి పనికొచ్చే పౌష్టికరమైన వి మనకు ఇస్తారు.. కాస్తంత తెలుసుకో..

నేను : అవునండి..

మగాడు : గది సరే గానీ .. గీ విషయాలన్నీ నా గర్ల్ ఫ్రెండ్స్ కి గిట్టా తెలియజేయ మాక.. నా పని కొల్లేరౌతాది..

నేను : అలాగే

మగాడు : మరి నేను ఉంటాను.. నా నాలుగో పోరిని కలిసే వేళ్ళైంది..

నేను : నాలుగో పోరి అంటున్నారు.. ఎంత మంది ఉన్నారే..

మగాడు : దాదాపు ఓ డజన్ టచ్ లో ఉన్నారు.. ముగ్గురితో టిపినీలు అయ్యాయి.. ఓ పోరి దాదాపు లంచ్ కి రెడీ.. ఇక టైమ్ అండ్ ప్లేస్ కోసం సూత్తున్నా..

నేను : ఇంత మందిని ఎలా ..

మగాడు : ఏముంది.. ఇందాక సెప్పినట్లు .. ఏ పోరి దగ్గరకు పోయినా ఒక్కాటే మాట.. నువ్వొక్కత్తివే నా లైఫ్ లో .. అంతే గదే నిజమ్ అనుకుంటారు .. మనకి మాత్రం పని గడవాల్న .. సరేగానీ ఇక ఉంటా, అవతల్న నా కోసం అక్కడ పోరి వెయిటింగ్.. ఒరే చిచ్చా.. సార్ దగ్గర పైసల్ తీసుకొ భే..

నేను : హా!!!!


ఈ పుట ఏదో హాస్యాస్పదంగా ఉంటుందని మాత్రమే మొదలు పెట్టాను.. అంతే గానీ ఎవ్వరినీ ఉద్దేశ్సించి కాదని నా మనవి

7 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

Quite good.
మగాడు గారి భాషలో కన్సిస్టెన్సీ కొరవైంది అక్కడక్కడా తన యాసని మర్చిపోయి.
మీరు కొంచెం తెలుగు స్పెల్లింగునీ వాడుకల్నీ ఇంకొంచెం క్షుణ్ణంగా అభ్యసించాలి.
యాదృఛ్ఛికం, శ్చికం కాదు.
హాస్యాస్పదం అంటే నవ్వు పుట్టించేదే కానీ దాన్ని యెద్దేవా చేసే దృష్టిలోనే వాడుతారు. ఈ టపా హాస్యాస్పదం అంటే అర్ధం దీన్ని తీసి పారెయ్యొచ్చు, ఎవరూ పట్టించుకో నక్కర్లేదు అని.
మీరు చెప్పాలంకున్న ఉద్దేశం "ఈ టపా కేవలం హాస్యం కోసం రాశాను" కావచ్చు.

అజ్ఞాత చెప్పారు...

ఒక్క మగాడు – flop

teresa చెప్పారు...

సదరు, చాయ్‌ correct.
మగాడితో బాతాఖానీ సరదాగా ఉంది :)

ఓ బ్రమ్మీ చెప్పారు...

శంకరగిరి గారూ..

నిజమేనండి.. కానీ ఏదో వ్రాయాలి అన్న ప్రలోభంలో అలా వచ్చేసింది. హాస్యమే నా ప్రధాన ఉద్దేశ్యం అంతే కానీ అపహాస్యం కాదని చెప్పాలనుకున్నాను. ఏదో పదాలతో కుస్తీ పడుతున్నాను. పెద్ద మనసుతో సరిదిద్దినందులకు నెనరులు

హరనాద్ గారూ..

నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది.. as the movie so is my post..

ఏది ఏమైనా చివ్వరిదాకా చదివినందులకు నెనరులు

terasa గారూ,

కావాలనే ఒత్తు చ వాడాను
ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు

teresa చెప్పారు...

శంకరగిరి కాదు శంకగిరి :) శుభ్రంగా కొత్తపాళీ అంటే పోలా...

chaitanya చెప్పారు...

చక్రవర్తి గారు...
మీ వైఫ్ స్వాతి గారు ఒక పాటల బ్లాగు మొదలుపెట్టారని అప్పుడెప్పుడో మీరు చెప్పిన గుర్తు... ఆ బ్లాగ్ లింక్ ఇస్తారా...

అజ్ఞాత చెప్పారు...

yO..కన్సిస్టెన్సీ చూసుకోవాలి...రైటర్ అవ్వటం లక్ష్యం ఐతే....బట్ యాజ్ ఎ బ్లాగ్.....అదుర్స్...:)

 
Clicky Web Analytics