26, ఫిబ్రవరి 2009, గురువారం

మంత్రాలయం వెళ్ళివచ్చాము – విషేశాలు : మొదటి భాగం


ఈ పుట వెనుక చాలా కధ ఉంది, కానీ అది ఇక్కడ అప్రస్తుతం. ఇక్కడ పస్తుతమైనది ఏమిటంటే, ఆలోచనా తరంగాలుగా బ్లాగుతున్న మరో తెలుగు బ్లాగరు, తెలుగు యోగి, శ్రీ సత్యన్నారాయణ శర్మగారు మరియు వారి స్నేహాతత్పరత.

వీరి బ్లాగులో ’ఎస్ జానకి గారితో ప్రయాణం’ అన్న పుటలో వీరు మంత్రాలయం నుంచి గుంతకల్లు వరకూ ప్రయానిస్తుంటే అనుకోకుండా ఎస్ జానకి గారు అందులో ఉన్నట్లు, వీరు వెళ్ళి జానకి గారితో కొద్ది సేపు మాట్లాడినట్లు వారి మధుర క్షణాలను గుర్తుకు తెచ్చు కున్నారు. ఇది చదివిన తరువాత మంత్రాలయం వెళ్ళే విషయంలో వీరిని సంప్రదించాలి అనుకున్నాను. అనుకున్నదే తడవుగా వీరిని సంప్రదించేప్రయత్నంలో పడ్డాను. వీరికి ఫోన్ చేసి, అయ్యా నేను మంత్రాలయం వెళ్ళాలి అనుకుంటున్నాను, కొంచం వివరాలు తెలియ జేయ గలరా అని అడిగాను. అంతే అన్నదే తడవుగా, మీకు ఈ విషయాలు నేను చెబితే అర్దం కావు కానీ, ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారో చెప్పండి మిగతావి నేను చూసుకుంటాను అన్నారు. అంటూనే.. మీరు మంత్రాలయం వచ్చేటప్పటికి అర్దరాత్రి అవుతుంది, అందుకని మీ కోసం అక్కడ ఒక రిటైరింగ్ రూమ్ అట్టి పెడతాను. మంత్రాలయం లొ దిగగానే నేరుగా బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్ళండి. అక్కడ డ్యూటీలో ఉండే టీటీ కి మీపేరు చెప్పండి, ఆయన మీకు ఆ రూమ్ ఇస్తారు. చక్కగా ఉదయం వరకూ విశ్రాంతి తీసుకోండి. ఉదయం మీ కోసం అక్కడ ఒక వ్యక్తిని ఎరేంజ్ చేస్తాను, అతను మిగిలిన విషయాలన్నీ చూసుకుంటాడు .. అంటూ ముగించారు. ఏమిటో ఇలా అన్నారు అని మనసులో ఉన్నా భారం దేవుని మీద వేసి బయలు దేరాను.

హైదరాబాదు నుంచి రాయగడ ఎక్సుప్రస్ మంత్రాలయం మీదుగా వెళ్ళుతుందని తెలిసి ముందుగా రిజర్వేషన్ చేయించుకున్నాను. చక్కగా శని వారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు బేగం పేట రైల్వే స్టేషన్ నుంచి మా ప్రయాణం మొదలైంది. రాత్రికి ప్రయాణం మధ్యలొ తినడానికి ఏమైనా దొరుకుతాయో లేదో అని ఓ టిఫిన్ బాక్స్ నిండా పులిహోర చేసుకుని బయలు దేరాము. అలా నిదానంగా ప్రశాంతంగా మొదలైన మా ప్రయాణం ఆద్యంతం ఇలాగే సాఫీగా చక్కగా సాగి పోనుందని మాకు అప్పడు తెలియలేదు.

మంత్రాలయం చేరుకునేటప్పటికి అర్ద రాత్రి అవుతుందని టీటీ చెప్పగానే నిద్రని ఆపుకుని మెలుకువగా ఉండి వచ్చే పోయ్యే స్టేషన్ పేర్లను మననం చేసుకుంటూ కాలం గడిపేయ్యడం మొదలు పెట్టాను. మా దురదృష్టవశాత్తు ఆరోజు రాయగడ ఎక్సుప్రస్ ఓ గంట ఆలస్యంగా నడుస్తోంది. అలా మేము సమయాన్ని లెక్కపెడుతూ సాగిస్తున్న మా ప్రయాణంలోని మొదటి మజిలీ రానే వచ్చింది. అప్పటికి మధ్య రాత్రి దాటి గంటన్నరైంది. సత్యన్నారాయణ శర్మ గారు మాతో చెప్పినట్లుగా మంత్రాలయం లో దిగగానే నేరుగా టీటీ దగ్గరకు వెళ్ళగానే చక్కగా మాకోసం బుక్ చేసిన రూమ్ తాళాలు ఇచ్చారు. అక్కడి రిజిస్టరులో మా చిరునామా వ్రాసి, అద్దె క్రింద ఓ వంద రూపాయలు జమ చేసి మెల్లగా మా గదికి చేరుకుని నిద్రకి ఉపక్రమించె సమయం లో ఎవ్వరో తలుపు తట్టారు. ఈ సమయంలో ఎవ్వరై ఉంటారా అని అనుకుంటూ, తలుపు తెరిచాను.

ఎదురుగా ఓ పెద్దాయన, “నాపేరు ప్రకాష్.. మీరు రేపు గుడికి ఎన్ని గంటలకు వెళతారు?” అని ప్రశ్నిస్తూ కనబడ్డారు. నిద్ర మత్తులో ఉన్నానేమో, ముందు కొద్ది సేపు ఏమీ అర్దం కాలేదు. మెల్లగా తేరుకుని,

“ఏడు గంటలకల్లా మేము సిద్దంగా ఉంటాము. ఆ తరువాత ఆలోచిద్దాం తదుపరి కార్యక్రమం” అనగానే,

“సరేనండి. ఉదయం కలుస్తాను.. ఉంటాను..” అంటూ సెలవు తీసుకున్నారు, సదురు ఫ్రకాష్.

అలా ఆ రాత్రి అక్కడ విశ్రాంతి. మరునాటి విషయాలు మరో పుటలో.

6 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

ఆసక్తికరం...

Malakpet Rowdy చెప్పారు...

How Nice!

సౌమిత్రి చెప్పారు...

బాగుంది మీ మంత్రాలయ ప్రయాణ అనుభవం, పూర్తిగా చదివిన తర్వాత నేను కూడా ఆలోచిస్తాను, అక్కడకి వెళ్లే సంగతి :)

అజ్ఞాత చెప్పారు...

ఇన్ని రోజులుగా బ్లాగులో ఏమి వ్రాయటం లేదు .. ఎక్కడికి వెళ్ళారా అనుకున్నాను .. welcome back .. waiting for next part

Unknown చెప్పారు...

adi rayalaseema express andi rayagada orissa side miru vellindy karnataka side.

cbrao చెప్పారు...

మీ మంత్రాలయం యాత్ర ప్రశాంతంగా జరిగిఉండగలదని తలుస్తాను. భక్తులు భిన్నమైన కానుకలు దేవునికి సమర్పిస్తారు. కొందరు జుట్టునిస్తారు. కాని ఇది తిరిగి వస్తుంది (మొలుస్తుంది). నా అదోని మిత్రుడు తిరిగిరాని దాన్ని మంత్రాలయంలో భగవంతునికి కానుకగా ఇచ్చాడు. దాని వివరం మీ రాబోయే మరో పుటలో.

 
Clicky Web Analytics