12, డిసెంబర్ 2008, శుక్రవారం

అందం శాపమా ? లేక అమ్మాయా!!! ఏది?

 

రెండు రోజుల క్రిందట TV9లో వార్తలు వింటుంటే చూసిన దృశ్యాలు నన్ను ఈ రెండు రోజులూ దుఃఖసాగరంలో ముంచి తేల్చాయి. శీర్షికలో చెప్పినట్లుగా.. అందంగా ఉండడం శాపమా? లేక అమ్మాయిగా పుట్టడం శాపమా? అంతే అనుకుంటే, అమ్మాయిగా పుట్టి అందంగా ఎదగడమే ఈ నాటి ఆడ పిల్లలు చేసుకున్న గత జన్మ కర్మ ఫలమా? జీవితపు ప్రారంభ దశలోనే అష్టకష్టాలకు ఎదురీదుతున్న స్వప్నిక మరియూ ప్రణీతలు ఏ జన్మలో చేసుకున్న పాపఫలం ఇది?

 

ఆశించద్దు అని ఎవ్వరూ చెప్పలేదే, కానీ శాసిస్తే ఎదుర్కునే హక్కు ప్రతీ వారికీ ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా ఎదుర్కుంటారు? ఎవ్వరిని ఎదొర్కొంటారు? అలనాడు ప్రాణమే తీసిన అగంతకుడు చక్కగా ఊచల వెనుక మనో నిబ్బరంతో నిద్రపోతుంటే, ఈ నాడు ఉన్న జీవితాన్ని అంధఃకారం లోకి నెట్టేసిన కిరాతకులను కొమ్ముకాస్తున్న పోలీసు వ్యవస్థని ఎవ్వరు నిలదీస్తారు? ఏమి చేస్తే ఇలాంటి వారికి న్యాయం జరుగుతుంది? సబ్య సమాజం నివ్వెర పోయేటట్లు ప్రవర్తించిన కిరాచకుడి చర్యనుంచి వీరు బయట పడి నిండు జీవితాన్ని ఎలా పోరాడాలో నేర్చుకునేంత వరకూ వీరికి ఉపశమనమేది?

 

వయ్యస్సులో చిన్నదైనా, ’దేవుడనే వాడు ఉన్నాడు.. నాకు అన్యాయం చెయ్యడు.. అన్నీ ఆయనే చూసుకుంటాడు ..’ అంటూ పలుకుతున్న ఈ చిన్నారికి ఏమి చెప్పాలి? మున్ముందు ఉన్న జీవితం అంతా అంధః మయమై చీకటిలోనే రంగులు వెతుక్కోవాల్సిన పరిస్తితికీ, ఈ పిల్ల చేసుకున్న పుణ్యం ఏమిటి? దేవుడా!! నిన్ను ప్రశించే వారు ఎవ్వరూ లేరా? ఎవ్వరూ లేరని విర్రవీగుతున్నావా? లేక ఎవ్వరికి ఏమి నేర్పిద్దామని ఈ చిన్నారులకు ఇంత పెద్ద శిక్ష విధించావు? హింశ అన్నింటికీ ఒకదారి కాదు అని అందరికీ తెలుసు, మరి ఈ ఇద్దరు చిన్నారులను ఇంత కౄరంగా చేసేటట్లు తలంచిన యువతను పెంచే పెద్దలకు ఈ విషయాన్ని ఎవ్వరు తెలియ జేస్తారు?

 

శిక్ష పిల్లలకు ఎంత వేస్తారో అంతకన్నా ఓ విడత ఎక్కువగా వారిని కన్న తల్లి తండ్రులకు కూడా వెయ్యాలనేది నా అభిప్రాయం. ఇందులో వారి తప్పేంటి అంటారా.. అదేదో తెలుగు సామెత చెప్పినట్లుగా, మ్రొక్కై వంగనిది మానై వంగునా .. అన్నట్లు, మొక్కగా ఉన్నప్పుడే వీరి ఆలోచనలను పసిగట్టలేని తల్లి తండ్రులు, వారి నిర్లక్షానికి ఎంత పెద్ద రుసుము చెల్లించాయో ఈ పసి హృదయాలు. వయ్యస్సులో ఉన్న యువతను అర్ధం చేసుకో లేని తల్లి తండ్రులూ తల్లితండ్రులేనా? వీడెవడో ఇలాంటి పని చేస్తే మరొకడు ఎంచక్కా తాను ప్రేమించిన అమ్మాయి కాలం చేసిందని ఎంచక్కా పేపర్లో ప్రకటనే ఇచ్చేసాడే.. ఏమిటి ఈ ప్రవర్తన? వీరిని ఒక సక్రమమయిన దారిలో పెంచలేని తల్లి తండ్రులు ఇక ఉండీ ఏమి ప్రయోజనం?

 

పిల్లలు అప్రయోజకులుగా పెరుగుతున్నారు అనే విషయాన్ని గ్రహించ లేనంత బిజీగా ఈ తల్లి తండ్రులు ఏమి చేస్తున్నారో నాకు అర్దం కావటం లేదు. ఇల్లు, ఇల్లాలు, కన్నవాళ్ళు, కని పెంచిన వాళ్ళు, వారి వారి భవిష్యత్తు వీటి  కన్నా ముఖ్యమైన విషయాలు ఉంటాయా.. వీటిల్ని నిర్లక్ష్యం చేస్తూ ఇంతటి ఘాతుకాని పాల్పడుతున్న పిల్లలను పట్టించు కోని పెద్దల హస్తం ఇటువంటి చర్యలకు అన్యమస్తకంగా హేతువు కాదా? మరి వారికి ఎటువంటి శిక్ష పడాలి?

7 కామెంట్‌లు:

KumarN చెప్పారు...

"మొక్కగా ఉన్నప్పుడే వీరి ఆలోచనలను పసిగట్టలేని తల్లి తండ్రులు, వారి నిర్లక్షానికి...

"పిల్లలు అప్రయోజకులుగా పెరుగుతున్నారు అనే విషయాన్ని గ్రహించ లేనంత...

Salute to you brother.

గంట నుంచీ నేను చూస్తున్న బ్లాగు లోకంలో నా మదిలోని ఆలోచనలని మీరొక్కరు మాత్రమే బాగా పట్టుకొని చెప్పారు.

Unbelievable Parenting..

ఇంకా నాకు అవధులు లేనంతగా, కోపం తగ్గడానికి ఒక నిమిషం బయట చల్లగా 30F లో నిలబడొచ్చేంతగా, కోపం తెప్పించిన విషయమేంటంటే, ఇందాకెక్కడో ఆంధ్రజ్యొతి లోనో, మరో బ్లాగులోనూ, కొంచెం తప్పు ఆ అమ్మాయిది కూడా ఎంది అని మాట్లాట్టం. ఏంటా తప్పు అంటే, ఆ అబ్బాయితో అంతకు ముందు తిరిగింది, డబ్బులు ఖర్చు పెట్టించింది..అనీ. బ్లా, బ్లా, బ్లా..

తిరిగితే ఏంటి? బయటకు వచ్చేయడం అనేది ఆ అమ్మాయి జన్మ హక్కు కాదా? ప్రేమించి బయటకెళ్ళిపోతే, ఆసిడ్ పోయడం 100 శాతం తప్పు కాకుండా, 90 శాతమే అవుతుందా..

భగవంతుడా..నా దేశాన్ని రక్షించు.

ఓ బ్రమ్మీ చెప్పారు...

కుమార్ గారూ..

ఈ పుట వ్రాస్తున్నప్పుడు దిశ నిర్ధేశం లేకుండా మదిలో మెదిలిన భావాలను యధా విధంగా వ్రాసేశాను. అంతా పూర్తి చేసిన తరువాత తిరిగి చదువుకుంటుంటే, అప్పుడు అనిపించింది. ఈ పుటని ఎవ్వరైనా చదువుతారా? ఒకవేళ చదవడం మొదలు పెడితే, ఆద్యంతం చదువుతారా? లేక మొదటి పేరా చదవగానే ఇదేదో భాధా తప్త, శొకమయ భావోద్రేకం .. అని చులకనగా చూస్తారు తప్పితే, నా భాధను అర్దం చేసుకోరు అనిపించింది. అయినా నేను ఎవ్వరి కోసమో వ్రాయలేదు కదా అని సర్ది చెప్పుకుని, సెన్సార్ చెయ్యకుండా యధావిధిగా ప్రచురించేసాను. మీరు చదివారు.. స్పందించారు.. అంతే చాలు.

ధన్య్దవాదములతో..

Uyyaala చెప్పారు...

అబౌట్ మీ లోని వాక్యాలు :
" కాకిలా అరిచి, గీ పెట్టి గోల చేయరని ఆశిస్తున్నాను. ఏమైనా ఉంటే మనం మనం శాంతియుతంగా పరిష్కరించు కుందాం. "
పై పదాలు మాత్రం శాంతియుతంగా లేవు చక్రవర్తి గారూ! ఎంత అశాస్త్రీయ, పాక్షిక విమర్శలు చేసేవాల్లనైనా కాకులతో పోల్చడం సరికాదు. సభ్యతా కాదు! సరిదిద్దుకుంటే బాగుంటుంది.
- ప్రభాకర్ మందార, హైదరాబాద్

అజ్ఞాత చెప్పారు...

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ- తెలుగు తెలుగు బ్లాగుల గురించి ప్రచారం చెయ్యడానికి మనకు అనుమతి దొరికింది.
సమయం : శనివారం సాయంత్రం 6- 7
వేదిక :పీపుల్స్ ప్లాజా, నెక్లేస్ రోడ్.
దయచేసి, వీలు చేసుకుని హాజరవుతారని ఆశిస్తున్నాం.

Aruna చెప్పారు...

నిజంగా చెప్పాలి అంటే అందం అమ్మాయిలకి శాపం. నాకు ఇదే మాట చాలా సార్లు అనిపించింది. ఆ మాట అందిరితో అంటే నన్నో వాజమ్మ కింద జమ కట్టేయ్యాలని ప్రయత్నిస్తారు అని ఇంట్లో వాళ్ళ దగ్గరే ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచేదాన్ని.

ఓ బ్రమ్మీ చెప్పారు...

అరుణగారూ.. ఖశ్చితంగా అందం అమ్మాయిల పాలిట శాపమే. నాకు తెలిసినంత వరకూ ఇలా..

మొదటిగా, అందం ఆకర్షించ బడుతుంది. తప్పులేదు. కానీ, ఆకర్షించే దానిని ఆశిస్తే తప్పులేదు. అంతే కానీ శాసిస్తేనే అసలు ప్రమాదమంతా.

రెండవది, అందం ఆత్మ స్థైర్యాన్నిస్తుంది. కానీ ఆ ఆత్మ స్థైర్యం తల పొగరుగా మారకూడదు. అందం ఉన్న అమ్మాయికి వినయం భూషణమే, అంతే కానీ నేను (మాత్రమే) అందంగా ఉన్నాను, నాకేంటి అనేటటు వంటి భవనలు ఆడవారికి వినాశకాలాన్ని తీసుకొస్తుంది.

ఆఖరుగా, ఆంగ్ల సామెత చెప్పినట్లు, అందం మరియు భుద్ది రెండూ ఎప్పుడూ కలిసి (జత కట్టలేవంట) ప్రయాణం చెయ్యవంట. కానీ కలిసి పోగలిగితే అంత కన్నా మించిన అదృష్టం మరొకటి ఉండదు.

అందువల్లన అందంగా ఉండే అమ్మాయి భుద్దిగా ఉంటే ఇటువంటివి జరగవని నా అభిప్రాయం. ఈ అమ్మాయి విషయంలో సగం కాక పోయినా చిటికెడో.. చారెడో .. ఈ పిల్లది కూడా ఎంతో కొంత తప్పు జరిగి ఉండ డానికి అవకాశం లేక పోలేదు.

Mauli చెప్పారు...

@శిక్ష పిల్లలకు ఎంత వేస్తారో అంతకన్నా ఓ విడత ఎక్కువగా వారిని కన్న తల్లి తండ్రులకు కూడా వెయ్యాలనేది నా అభిప్రాయం.

ఇది ముమ్మాటికీ నిజ౦. ఇక మీరు చాలా స౦యమన౦ గా వివరి౦చారు.

హ్మ్మ్ ఇలా౦టి స౦ఘటన స్వయ౦ గా దగ్గరు౦డి చూసిన నాకన్న ఇ౦కెవ్వరు చెప్పగలరు, మీరు వ్రాసినవే నిజాలని. ఈ కధ కూడా పె౦డి౦గ్ లో ఉ౦ద౦డి వ్రాయడానికి. స౦ఘటన జరగ గానే హడావిడిగా అబ్బాయిలను చీల్చి చె౦డాడుతూ వ్రాసే వారు(నా దృష్టి లో అనుమానాస్పదమైన సామాజిక స్పృహ) ఒకసారి చదివి వెళ్ళాల్సిన టపా ఇది ఖచ్చిత౦గా.

 
Clicky Web Analytics