22, అక్టోబర్ 2016, శనివారం

దేశ ద్రోహమా లేక శత్రు ప్రోత్సాహమా!!!


దీపావళి అనేది రాక్షస సంహారార్దం జరుపుకునే ఓ పండుగ.

అలాంటి కారణాన్ని అడ్డు పెట్టుకుని, చైనా వస్తువులు ఎన్ని భారత దేశంలో అడుగుపెడుతున్నాయో తలచుకుంటే, భారతదేశ ప్రజలు చైనా ఆర్దిక వ్యవస్థకు ఎంతగా ప్రోత్సహిస్తున్నారో అర్దం కావటం లేదు. ఫెస్టివల్ ఆఫర్సు ద్వారా కొనుగోలు చేసిన వస్తువుల ద్వారా దాదాపు లక్షకోట్లు వారికి చేరుతున్నాయి అంటే అది అతిశయోక్తి కాదు.

లక్ష కోట్ల పెట్టుబడులు భారత దేశ ఆర్దిక విధానాన్ని ఎంతైనా ప్రభావితం చెయ్యగలవు. తెలిసి చేసినా తెలియక చేసినా, చైనా వస్తువులు కొనడం ద్వారా తెలియకుండానే వారి ఆర్దిక వ్యవస్థని పటిష్టం చేయ్యడమే కాకుండా, మనకు శత్రుత్వం ఉన్న వారి కి సహాయపడేలా పోత్సాహిస్తున్నాము.

లక్ష కోట్లు .. ఆ మాట వింటేనే గుండ ఝల్లు మంటోంది. ఒక్క దీపావళి ఆఫర్ల రూపంలో లక్ష కోట్లు అప్పనంగా చైనా పరం చేసేసామా!!! నమ్మకం కలగట్లేదా!!! ఉదాహరణకి ..

MI అనేది చైనా కంపెని. ఈ కంపెనీని రెడ్ మీ, RedMI, అని కూడా పిలుస్తారు. వారి స్మార్ట్ ఫోన్ల అమ్మాకాల గురించి ఈ మధ్య వారు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఒక్క 18 రోజులలో ఒక మిలియన్ (అంటే పది లక్షల) స్మార్ట్ ఫోన్స్ అమ్మకం జరిగాయి. అలాగే గత ఆరు నెలలలో 2.3 మిలియన్ ఫోన్ల అమ్మకాలు జరిగాయి. అధమపక్షం ఒక్కో ఫోను ఖరీదుని పదివేల రూపాయలుగా వేసుకుంటే, వారికి అందిన మొత్తం దాదాపుగా 22,99,77,00,000/- రూపాయలు. అంటే, దాదాపుగా, ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు.

ఇది ఒక్క MI వారు ఆర్బాటంగా చెప్పుకున్న (ఒక్క ఫోన్ల గురించి మాత్రమే) వివరం. ఫోన్లు కాకుండా వారి వద్ద నుండి పలు వస్తువులు కూడా కొన్నట్లు వాటి విలువ ఓ పది వేల కోట్లలో ఉన్నట్లు వారే బాహాటంగా చెప్పుకుంటున్నారు. అంటే ఒక్క MI ద్వారానే దాదాపుగా ముఫై మూడు వేల కోట్ల రూపాయలు భారత దేశం దాటిందంటే, అలాంటి ఫోన్లు ఎన్ని ఉన్నాయో ఒక్క సారి ఆలోచించండి.

ఇవి నేను ఊహించి చెప్పటం లేదు .. ఇవిగో సాక్షాలు ..

  1. http://www.mi.com/in/events/diwali2016/report/  - 18 రోజులలో ఒక మిలియన్ అమ్మకాల గురించి గొప్పగా చెప్పుకుంటున్న వివరం
  2. https://www.facebook.com/notes/mi-india/a-letter-from-xiaomi-ceo-lei-jun-on-mi-indias-latest-milestone1-million-smartpho/1799336966947533 - ఆరు నెలల వ్యవధిలో 2.3  మిలియన్ల అమ్మకాల గురించి, ఆ కంపెనీ వారి CEO గారు, వారి ఉద్యోగులకు వ్రాసిన లేఖా పత్రాన్ని ఫేస్ బుక్కులో గొప్పగా ప్రకటించుకున్న లంకె..

సందడిలో సడేమియా అంటూ, OnePlus కంపెనీ వారు దీపావళి ధమాకా అంటూ సేల్స్ మొదలు పెట్టారు. ఇక వీరు ఎంత దండుకుంటారో!!!

ఇలా చైనా వస్తువులు కొని వారిని ప్రోత్సహిస్తూ మన ధనాన్ని వారికి ఇచ్చేద్దామా!!!

అప్పుడేప్పుడో, 1905 నుంచి 1917 వరకూ, విదేశీ వస్తు భహిష్కరణా ఉద్యమం ద్వారా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించినట్లుగా, భారత దేశ ఆర్దిక వ్యవస్థకు చిల్లులు పడేలా అమ్మకాలు జరుగుతున్న తరుణంలో, మన వంతు కర్తవ్యంగా, ఈ చైనా వస్తువులను బహిష్కరిద్దాం. భారత దేశంలోనే తయ్యారయ్యే ఫోన్లను కొందాం.

ఒక్క సారి ఆలోచించండి. చైనా వస్తువులను కొని శత్రు దేశాల ఆర్దిక వ్యవస్థని పటిష్ట పరుస్తూ వారిని ప్రోత్సాహిద్దామా, లేక స్వదేశీ వ్యవస్థని మెఱుగు పరచుకుందామా!!!

సన్నిహితుల సలహా ప్రకారం, ఈ వివరాన్ని కూడా చేరుస్తున్నాను.

సరే, చైనా వస్తువులను కొనవద్దు, దానికి ప్రత్నామ్యాయంగా ఏమి చేయ్యాలి అని అంటే, ఇదిగో భారత దేశంలో తయ్యారైయ్యే ఫోన్ల వివరాలు. ఇవి నేను చెబుతున్నది కాదండోయ్ .. వికీ పీడియాలో మీకు దొరుకుతాయి.. ఉదాహరణకి మైక్రో మాక్స్ భారత దేశంలో తయ్యారు చెయ్యబడిన ఫోన్ .. అలాగే ..  సెల్కాన్, ఐబాల్, లావా, విడియో కాన్,  జ్లోలో, యు (YU) వంటి కంపెనీలు అచ్చంగా భారత దేశంలో తయ్యారు చేయ్యబడ్డ ఫోన్లే .. దేశపరంగా కంపెనీల వివరాలు ఈ లంకెలో ఉన్నాయి .. https://en.wikipedia.org/wiki/List_of_mobile_phone_makers_by_country

వీలైతే అని అనుకోకుండా, వీలు చేసుకుని భారత దేశంలో తయ్యారయ్యే ఫోన్లనే కొందాం..

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
 
Clicky Web Analytics