22, సెప్టెంబర్ 2013, ఆదివారం

ప్రయాగలు : వాటి వివరము

భారతీయ సంస్కృతిలో రెండు అంతకన్నా ఎక్కువనదుల సంగమమాన్ని ప్రయాగ అంటారు. ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. మొన్నామధ్య నాన్నగారి అస్తికలు ప్రయాగలో, అలహాబాద్ లోని ప్రయాగలో నిమజ్జనం చెయ్యడానికి వెళ్లి వచ్చిన తరువాతనే ఈ విషయం అర్దం అయ్యింది.

 

పేరు ఏ ఏ నదుల సంగమము
ప్రయాగ రాజ్ గంగ యమున సరస్వతి సంగమము
దేవ ప్రయాగ అలకనంద భాగీరధి సంగమము
రుద్ర ప్రయాగ అలకనంద మందాకిని సంగమము
కర్ణ ప్రయాగ పిండార్ గంగ అలకనంద సంగమము
నంద ప్రయాగ అలకనంద నంద సంగమము
విష్ణు ప్రయాగ అలకనంద విష్ణుగంగ సంగమము
సూర్య ప్రయాగ మందాకిని అలసత్రంగి సంగమము
ఇంద్ర ప్రయాగ భాగీరధి వ్యాస గంగ సంగమము
సోమ ప్రయాగ సోమనది మందాకిని సంగమము
భాస్కర ప్రయాగ భస్వతి భాగీరధి సంగమము
హరి ప్రయాగ హరి గంగ భాగీరధి సంగమము
గుప్త ప్రయాగ నీల గంగ భాగీరధి సంగమము
శ్యామ ప్రయాగ శ్యామ గంగ భాగీరధి సంగమము
కేషబ్ ప్రయాగ అలకనంద సరస్వతి సంగమము

 

కాకపోతే, వీటిల్లో చాలా చోట్లు ప్రస్తుత కాలంలో తెలియబడటం లేదు. ఉదాహరణకి అలసత్రంగి అనే నది ఒకటి ఉన్నది అని నాకు ఇంత వరకూ తెలియదు. వీటిల్లో వేటి గురించైనా తెలిసిన వారు, ఆ యా వివరాలను తెలియజేయ మనవి.

15, జులై 2013, సోమవారం

నాన్నగారు ..

ఈ నెలలో నాన్నగారి మొబైల్ నుంచి ఒక్క కాల్ కూడా లేదు.

పోనీ నేను చేద్దాం అనుకుంటే, అన్నయ్య ఆన్సర్ చేస్తున్నాడు.

లేరు అన్న విషయం ఎంత నిజమైనా, తెలియకుండా ఏదో ఒక సమయంలో నాన్నగారి తో మాట్లాడాలన్న ఆలోచన వస్తునే ఉంది.

 

DSC00194

 

 

 

 

 

భావాలు ఎన్ని ఉన్నా, ఎమీ వ్రాయలేకపోతున్న నా చాతకాని తనానికి సిగ్గుపడుతున్నా.

 
Clicky Web Analytics