భారతీయ సంస్కృతిలో రెండు అంతకన్నా ఎక్కువనదుల సంగమమాన్ని ప్రయాగ అంటారు. ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. మొన్నామధ్య నాన్నగారి అస్తికలు ప్రయాగలో, అలహాబాద్ లోని ప్రయాగలో నిమజ్జనం చెయ్యడానికి వెళ్లి వచ్చిన తరువాతనే ఈ విషయం అర్దం అయ్యింది.
పేరు | ఏ ఏ నదుల సంగమము |
ప్రయాగ రాజ్ | గంగ యమున సరస్వతి సంగమము |
దేవ ప్రయాగ | అలకనంద భాగీరధి సంగమము |
రుద్ర ప్రయాగ | అలకనంద మందాకిని సంగమము |
కర్ణ ప్రయాగ | పిండార్ గంగ అలకనంద సంగమము |
నంద ప్రయాగ | అలకనంద నంద సంగమము |
విష్ణు ప్రయాగ | అలకనంద విష్ణుగంగ సంగమము |
సూర్య ప్రయాగ | మందాకిని అలసత్రంగి సంగమము |
ఇంద్ర ప్రయాగ | భాగీరధి వ్యాస గంగ సంగమము |
సోమ ప్రయాగ | సోమనది మందాకిని సంగమము |
భాస్కర ప్రయాగ | భస్వతి భాగీరధి సంగమము |
హరి ప్రయాగ | హరి గంగ భాగీరధి సంగమము |
గుప్త ప్రయాగ | నీల గంగ భాగీరధి సంగమము |
శ్యామ ప్రయాగ | శ్యామ గంగ భాగీరధి సంగమము |
కేషబ్ ప్రయాగ | అలకనంద సరస్వతి సంగమము |
కాకపోతే, వీటిల్లో చాలా చోట్లు ప్రస్తుత కాలంలో తెలియబడటం లేదు. ఉదాహరణకి అలసత్రంగి అనే నది ఒకటి ఉన్నది అని నాకు ఇంత వరకూ తెలియదు. వీటిల్లో వేటి గురించైనా తెలిసిన వారు, ఆ యా వివరాలను తెలియజేయ మనవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి