12, నవంబర్ 2012, సోమవారం

గాయత్రీ మంత్రం .. ఇందుకా!!

గాయత్రీ మంత్రం.. ఎలా మొదలు పెట్టాలి అన్న ఆలోచనతో సతమతమౌతున్నప్పుడు, ఉన్నదేదో సూటిగా చెప్పేస్తే పోలా అన్న ఆలోచనతో ఎక్కువ చించకుండా మొదలుపెట్టేసాను.

 

ఉపోద్ఘాతం:

ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన ఇంట్లో కాలింగ్ బెల్ యొక్క సౌండుగా పెట్టుకున్నారు.

ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన సెల్ ఫోన్ రింగ్ టోనుగా పెట్టుకున్నారు.

ఓ పెద్దావిడ, గాయత్రీ మంత్రాన్ని తన ఫోన్ కాలర్ టోనుగా పెట్టుకున్నది.

ఓ కుర్రవాడు, గాయత్రీ మంత్రాన్ని తన కారు రివర్స్ చేసుకునేటప్పుడు హెచ్చరిక చేసే విధానంగా వాడుకున్నాడు.

ఓ యువతి, గాయత్రీ మంత్రాన్ని నలుగురు వినేటట్టు ఓ లౌడ్ స్పీకర్లో పొద్దు పొద్దునే పెట్టేసింది..

..

..

 

ఇక అసలు భావన

గాయత్రీ మంత్రం అనేది జగమెరిగిన రహస్యం. అట్టి గాయత్రిని ఉపనయన సంస్కరం అప్పుడు తండ్రి మాత్రమే చెప్పాలి, కొడుకు మాత్రమే వినాలి అన్నది ఆచారం. ఆ పద్దతిలో ఉపనయన క్రతువు జరిపించే బ్రహ్మగారు కూడా వినకూడదు అన్నట్లుగా, కొడుకు చెవిలో గాయత్రిని ఉపదేశించే తండ్రిని గోప్యంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో, వారిని కప్పుతూ ఉండే విధంగా ఓ పంచని కప్పుతారు. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న విధి విధానం. అందరూ పాటిస్తున్నా, ఈ విషయం తెలిసిన వారు కూడా ఖండించ కుండా మౌనం వహించి బ్రతకడం అంగీకరించ లేక పోతున్నాను.

ఎన్నో విషయాలు తెలిసాయి అనుకుని బ్రమ పడేవారు సైతం ఈ విషయాన్ని విశ్మరించి, జీవిస్తూ పెద్దవారిగా చెలామణి అవుతుంటే, అసహ్యం వేస్తోంది. వివరించి చెబుదాం అని ప్రయత్నం చేయ్యబోతే, వయస్సు రీత్యా చిన్నవాడివి నాకు చెప్పేంత సాహసం చేస్తావా అని దబాయించి బ్రతికేస్తున్నారు. చెట్టుకీ పుట్టకీ వస్తాయి, ఆలెక్కలో వేసుకుని ముందుకి సాగి పోతే సరి.

అందువల్ల చెప్పొచ్చినది ఏమిటంటే, సంస్కృతి అనేది ఒకటి ఉంది అని తెలుసుకుని ఆ విధంగా చేసేసుకుందాం.

7 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

గాయత్రీ మంత్రం శక్తివంతమైనదని మాత్రమే తెలుసు .ఎంతపవిత్రమైనదో .అత్యంతరహస్యంగా ఉంచుకోవలసిన విద్యనే తెలివితేటలు లేక ఈవిధంగా అరుగుతుంది. కలి యుగ ధర్మం

KRRAO చెప్పారు...

100% you are correct. I too agree with you Chakravarthi.

KRRAO

Rajasekhar చెప్పారు...

Enno vidyalanu rahasyamga unchi hinduism ni brastupattingcharu manalo unna chalamandi peddavaru vidyavantulu anduke devudu ila bayataki andari daggariki vastunnademo

Phani Pradeep చెప్పారు...

You're correct.

సో మా ర్క చెప్పారు...

చక్రవర్తిగారూ!గోంగళీలో(నల్లటి రగ్గు)తింటున్నాం!మళ్ళీ వెంట్రకలు వస్తున్నాయి అని బాధ పడడం ఏమిటి?ఇలాంటివి ఎన్నో అప్రాచ్యపు పనులు వెతకక్కర్లేకుండానే నేడువేలల్లో దొరుకుతాయి.ఎన్నింటికి సర్దుకు పోవడం లేదూ? ఇదీ అంతే!అయినా మీ బాధ అర్ధం చేసుకున్నాను.ఇది సబ్బుతోను,నిబ్బుతోను, కడిగితే పోయేదికాదు.నిప్పే కడతేర్చాలి.
పోయేది అంతకన్నా కాదు.

సో మా ర్క చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

మాకు తెల్వనియ్యకుండా విజ్ఞానాన్ని దాచేస్తున్నరు. చెవుల్లో చెప్పుకుంటున్నరు. వా.. వా..:((

 
Clicky Web Analytics