ఈ మధ్య అనుకోకుండా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే పేరుతో ప్రస్తావించ బడుతున్న చేతి వేళ్ళకు సంబందించిన ఓ వ్యాధితో బాధపడుతున్నాను. నిన్న నెప్పి ఎక్కువైతే దగ్గరలో ఉన్న ఓ MD చదువుకున్న ఓ వైద్యుని వద్దకు అత్యవసర పరిస్తితిలో వెళవలసి వచ్చింది. ఆ వైద్యులు గారు నా గోడు పూర్తిగా వినకుండానే ఓ నాలుగు రక్త పరిక్షలు వ్రాసి ఇచ్చారు. అందులో షుగర్ ఉందో లేదో అని తెలుసుకునే, RBS అంటే రాండమ్ బ్లడ్ షుగర్ పరిక్ష కూడా ఉంది. ఆ తరువాత మాటల మధ్యలో నాకు షుగర్ లేదని చెబుతుంటే, వినిపించుకోకుండా, ఆ పరిక్ష చేయ్యాల్సిందే అని చెప్పారు.
గత సంవత్సరంలో నవంబర్ నెలలో ఆఖరి సారిగా రక్త పరీక్ష చేయించుకున్నాను అంతేకాకుండా గత సంవత్సరంలో యాక్సిడెంట్ కారణంగా ఓ నాలుగు సార్లు చేయించుకున్నాను అని చెప్పిన తరువాత విషయాన్ని విని ఓ నాలుగు రకాల మందులు వ్రాసి ఇచ్చారు. ప్రస్తుతానికి ఇవి వాడండి ఆ తరువాత పరిక్షలు చేయించుకుని రండి అప్పుడు చూద్దాం, అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, జబ్బులు రోగులకు క్రొత్త కానీ వైద్యులకు క్రొత్త కాదు. చిటికెడు చెబితే చారెడు గ్రహించయ్యటం వీరికి అనుభవంలో వస్తుంది. కానీ రోగులకు విషయం చెప్పాలి కదా!! ఇలా వ్రాసుకుంటూ పోతే మరేదో వ్రాసేస్తాను.. విషయంలోకి వస్తే..
వైద్యో నారాయణ హరి.. అంటారు కదా, ఆయన చెప్పిన పరీక్షలకు రక్తం ఇచ్చి ఓ వెయ్యి రూపాయల బిల్లు చెల్లించి ఇంటికి చేరుకున్నాను. ఇచ్చిన మందులు వేసుకుని నొప్పి తగ్గుతుందేమో అని ఎదురు చూస్తూ గడిపేసాను. తీరా సాయంత్రం రిపోర్టులు తీసుకుని వెళ్ళి చూసే సరికి ఆ వైద్యులు గారు ఊరిలో లేరని తిరిగి సోమవారం వస్తారని తెలిసింది. ఇంతకు ముందు నాకు యాక్సిడెంట్ అయ్యినప్పుడు ట్రీట్ చేసిన వైద్యులు కూడా అంతే, వెళ్ళంగానే xరే తీయించుకుని రమ్మంటారు. తీయించుకుని వచ్చిన తరువాత దానిని చూడను కూడా చూడరు సరి కదా, చూపించ బోతే, “ నాకు తెలుసు ..” అంటూ మాట దాటేస్తారు.
ఇవన్నీ చూస్తున్న తరువాత వైద్యులపై గౌరవం కలుగకపోగా, అసహ్యం వేస్తోంది. అన్నింటికీ మించి, ఈ వైద్యులు గారు ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇచ్చిన మందులు వారి ప్రక్కనే ఉన్న కొట్లో కొనుక్కోవాలన్నమాట. అమ్మే దుకాణానికి లైసెన్స్ లేదు. దీనికి తోడుగా, వీరు చెప్పిన పరీక్షలు కూడా ఆ ప్రక్కనే ఉన్న దుకాణం వెనకాల ఉన్న గదిలో చేయించుకోవాలన్నది వీరి డిమాండ్. అక్కడ కాకపోతే సరి అయిన లేదా కరక్ట్ రిజల్ట్స్ రావంట. సరే నొప్పి తగ్గాలి కదా అని వీరు చెప్పిన మందులు తీసుకుని ఆ ప్రక్కనే ఉన్న గదిలో రక్తాన్ని ఇచ్చి ఇంటీకి చేరుకున్నా.
దీని నుంచి నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, కొంచం ఖర్చు ఎక్కువైనా వ్యాపార పరంగా ఉన్న పెద్ద హాస్పిటల్స్ ఫరవాలేదనిపిస్తోంది.
16 కామెంట్లు:
ఇండియాలో చాలామంది డాక్టర్ల మీద నమ్మకం నాకు ఎప్పుడో పోయింది. కేవలం కొద్ది మంది వైద్యులు నిజాయితీపరులు అయివుంటారు. మా యు ఎస్ లాంటి దేశాల్లో వైద్యానికి బాగా ఖర్చు అవుతున్నా కూడా చాలా వరకు బెటరే అని చెప్పవచ్చు. నేనయితే వీలయింతవరకు నెట్టులో సమాచారం సేకరించుకొని పరిష్కరించుకోలేని వాటికే డాక్టర్ల దగ్గరికి వెళుతున్నా. నెట్ విజ్ఞానం ద్వారా చిన్నచిన్న సమస్యలు చాలా పరిష్కరించుకున్నాను.
"మా యు ఎస్ లాంటి దేశాల్లో" ???
Carpal Tunnel Syndrome - Treatment Overview
The goal of treatment for carpal tunnel syndrome is to allow you to return to your normal function and activities and to:
Address other health conditions if they are making your symptoms of carpal tunnel syndrome worse.
Reduce any inflammation of tissues in the wrist that puts pressure on the median nerve.
Determine the causes of your carpal tunnel symptoms. You can then identify whether there are activities for you to avoid or do differently and ways you can help prevent the condition.
Prevent nerve damage and loss of muscle strength in your fingers and hand.
Treatment for carpal tunnel syndrome is based on the seriousness of the condition, whether there is any nerve damage, and whether other treatment has helped. Treatment options include treatment without surgery (nonsurgical treatment) or with surgery.
If treated early, carpal tunnel symptoms usually go away with nonsurgical treatment.
If your symptoms are mild, with occasional tingling, numbness, weakness, or pain, 1 to 2 weeks of home treatment are likely to relieve your symptoms.
If home treatment does not help, or if your symptoms are more severe (including the loss of feeling in your fingers or hand, or the inability to perform simple hand movements such as holding objects or pinching), have your doctor examine you and recommend treatment.
Nonsurgical treatment
If your symptoms are not severe, expect your doctor to recommend nonsurgical treatment to see whether symptoms improve. Nonsurgical treatment includes:
Evaluating any other medical problems that might contribute to carpal tunnel syndrome, and changing your treatment for those problems if needed.
Changing or avoiding activities that may be causing symptoms, and taking frequent breaks from repetitive tasks.
Wearing a wrist splint to keep your wrist straight, usually just at night. See a picture of a wrist splint .
Using nonsteroidal anti-inflammatory drugs (NSAIDs) to relieve pain and reduce inflammation. Although studies have not shown NSAIDs to be effective for carpal tunnel syndrome, they may help relieve your symptoms.
Learning ways to protect your joints as you go through your daily activities.
In some cases, oral corticosteroids or corticosteroid injections into the carpal tunnel may be considered if other methods to reduce inflammation do not work.
Surgical treatment
Surgery is sometimes recommended when other treatment has not helped, if a carpal tunnel condition has continued for a long time, or if there is nerve damage or the risk of nerve damage. Surgery involves cutting the ligament that forms the roof of the carpal tunnel. This relieves the pressure on the median nerve, which eases or ends the symptoms of carpal tunnel syndrome.
See a picture of the ligament involved in carpal tunnel release surgery .
Surgery is usually successful. In some cases it does not completely relieve the numbness and pain in the fingers or hand. This may be the case if there has been permanent nerve damage caused by long-standing carpal tunnel syndrome or by other health problems such as diabetes.
Carpal Tunnel Syndrome: Should I Have Surgery?
http://www.webmd.com/pain-management/carpal-tunnel/carpal-tunnel-syndrome-treatment-overview
నాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది అంది రెండు రోజుల ముందు.. చేతి మీద
దద్దుర్లు లాగ వస్తే ఏంటో అని బయపడి డాక్టర్ వద్దకు వెళ్ళాను.. రెండు ఇంజక్షన్లు చేసి ముప్పై మాత్రలు రాసారు.. తరువాత రోజు పొద్దున్నకి అది ఇంక పెద్దది పోయింది... నాకు భయం వేసి పరిగెత్తాను .. ఆ డాక్టర్ మహాను భావుడు నా చేతిలో ఏం లేదు.. స్కిన్ స్పెషలిస్ట్ వద్దకు పో అన్నాడు. ఆ కాడికి అన్ని (ముప్పై ) మాత్రలు రాయడం ఎందుకు.. దండుగ..
ఆ స్కిన్ స్పెషలిస్ట్ తక్కువ ఏమీ తినలేదు.. నాలుగు బ్లడ్ టెస్ట్‌లు షుగర్ తో కలిపి .. ఇంకేవో టెస్ట్‌లు రాసాడు . సర్ సమస్య ఏంటి అండి ఎందుకు ఇలా వచ్చింది అంతే సమాధానం లేదు. రిపోర్ట్లు రాని అని పంపేశాడు. ఎంత విసుగు తెప్పించారో చెప్పలేను. ఆ టెస్ట్‌లు చేసే వాళ్ళతో కలిపి.
తీర చూస్తే ఏమైంది.. అమ్మ వారు పోసింది అండి పక్కింటావిడ చూడ గానే చెప్పింది. నాకు అయినా కర్చు దగ్గర దగ్గర1500ల రూపాయలు .. ఎంత మోసం..?
చదువు కున్న డాక్టర్లు .. ఇదేనా చెయ్య వలసినది..?
శివ చెరువు గారూ , మరీ 30 రకాల మాత్రలు అంటూ రెండు సార్లు స్ట్రెస్ చేయకండి సార్ , ఎవరైనా నవ్వుతారు , ఏ డాక్టరు కూడా 30 రకాల మాత్రలు రాయలేడు , రాయాలన్నా అన్ని రకాలేం ఉండవక్కడ . అది ఫస్ట్ పాయింటు . రెండోది , ఏ డాక్టరుకు కూడా మంత్రశక్తులేం ఉండవు , చూడగానే జబ్బేమిటో చెప్పేసేయడానికి ' రాష్ విత్ ఇచింగ్ ' అనేదానికి సవాలక్ష కారణాలున్నాయి అదేంటో ఇలాచూసి అలా చెప్పేయడానికి కుదరదు , మెడిసిన్ ఒప్పుకోదు , రిపోర్ట్స్ రావాల్సిందే . ఆ మాత్రం ఆగలేకపోతే ఎలా ? రాష్ విత్ ఇచ్ అని నెట్ లో టైప్ చేస్తేనే అన్ని రిజల్ట్స్ వస్తాయే ఇంక 3000 పేజీలున్న డెర్మటాలజీ స్టాండర్డ్ పుస్తకం లో ఇంకెంత విషయం ఉండాలి ?
పోనీ మీరు చెప్పినట్టే ఏ ' ఆటలమ్మ ' అనో చెప్పేశాడనే అనుకుందాం , ఒకవేళ రిపోర్ట్స్ ప్రకారం అది ఇంకే వేరే జబ్బో అనుకుందాం , మీరే దుమ్మెత్తిపోయరూ ఫలానా డాక్టరు తప్పు చెప్పాడంటూ . మెడిసిన్ లో చాలా ఇఫ్స్ అంద్ బట్స్ పని చేస్తాయి . కేవలం కొన్ని జబ్బుల విషయంలోనే చూడగానే ఠకీమని ఫలానా అని చెప్పే వీలవుతుంది , అది మెడిసిన్ చదువుకుంటేనే అర్థమవుతుంది . ఐనా నేనేం మిమ్మల్ని తప్పు పట్టడం లేదు లెండి , ఈకాలం లో జనాల తీరే అంత . ఠక్కుమని జబ్బేమిటో చెప్పాలి , ఎంత త్వరగా వచ్చిందో అంతే త్వరగా నయమైపోవాలి . లేదంటే డాక్టరు వేస్ట్ . అలా అని నేను అందరు డాక్టర్స్ నూ గుడ్డిగా ఏమీ సమర్థించను , కాకపోతే ఈ పర్టికులర్ కేస్ విషయం లో మీరిచ్చిన ఉదాహరణ మాత్రం మీ ఆరోపణను ఏమాత్రం సమర్థించదు అని చెప్పదలుచుకున్నా .
ఇంతకీ అమ్మవారు పోసింది అని చెప్పిన ఆ పొరుగమ్మ నిజ నిర్ధారణ ఎంతవరకూ వాస్తవమో ఎలా నిర్ధారించుకున్నారు ? అది అవునో కాదో ఎలా తెలిసేది ? సరే లెండి ...కొన్ని సందర్భాల్లో ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అనుకోవాలి అంతే !
అఙ్ఞాత గారు,
నా చేతి వేళ్లు నెప్పులు పెడుతున్నా వ్రాస్తున్నాను. మొట్టమొదటిగా, శివ చెరువు గారు చెప్పినదానితో నేను ఏకీభవిస్తాను. వీలైతే నా ప్రిస్క్రిప్షన్ స్కాన్ చేసి ఇక్కడ ఉంచుతాను. దానిని చూసిన తరువాతనైనా మీకు అర్దం అవుతుంది, ఒకేసారి ముప్పై మాత్రలు వ్రాసే వైద్యులు ఎంతమంది ఉన్నారో. ఎందుకు వ్రాయకూడదో వారు చెప్పరు. వారికి కావలసినది మాత్రం అచ్చంగా డబ్బు మాత్రమే.
నేను వైద్యును వద్దకు వెళ్ళి అచ్చంగా నాలుగు రోజులు అయ్యిందో లేదో రిపోర్టులు చూపిద్దాం అని వెళితే మఱో ముప్పై రోజులకు మందులు వ్రాసి ఇచ్చారు మా ప్రస్తుత వైద్యులు. అంతే కాదు, వేళ్లు నెప్పి రావడానికి మెడ ఎముక కారణం అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి మెడ భాగాన్ని x-ray కూడా చేయించ మన్నారు.
వైద్యాన్ని నేను చదువుకోలేదు కాబట్టి వారు చెప్పింది చెయ్యడం మినహా ఏమి చేస్తాం చెప్పండి. మీరు జాలము నందు ఉదహరిస్తున్నారు కదా, మరి మెడ ఎముక ఏవిధంగా చేతి వేళ్ల నెప్పికి దారి తీస్తుందో కొంచం వెతికి చెప్పండి.
ఏది ఏమైనా మీ స్పందన హర్హించదగ్గదిగా లేదు. కావున ఇకపై కొంచం మర్యాదగా స్పందిస్తే మీ స్పందనలు తొలగింపబడవని గమనించగలరు.
నా వ్యాఖ్యలు తొలగించినా మరేం పర్లేదు లెండి . వైద్యులంటే అసహ్యం అని మీరంత స్ట్రెయిట్ గా ఒక పోస్టే పెట్టినప్పుడు నా లాంటి ఒక వైద్యుడు వ్రాసిన సుతిమెత్తని వ్యంగ్యంతో కూడిన వ్యాఖ్యకూడా నీకు అసహ్యం కలిగించడం లో ఆశ్చర్యమేమీ లేదు . సరే సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా రూల్ అవుట్ చేయడానికి X రే అవసరమే , నమ్మకపోతే మీ వ్యక్తిగతం . నేనింతకన్నా ఎక్కువ వాదించలేను.
పై వ్యాఖ్యలో 'మీకు ' బదులుగా ' నీకు ' అని ఆదాటులో జరిగిన తప్పిదం. క్షమింప వలెనని ప్రార్థన .
how you people think that you can get everything at free of cost??? just because of your democracy or just cuz of you are Indian????
check the "how to become a doctor in India" and then talk!!!
they have their share of talk!!!
you are neither important nor a subject of interest to them...its only for you...!!because pain is yours and dont expect them to feel your pain!!!
dont expect free services!!!
every service has its price!!! pay it and get it!! don't complain!!!
these..NRI's they talk a lot! just dont give em a care!! India is India!
as Mr. Yaramana expressed it, of course, no blogger would have been subjected to this kind of treatment. I dont know how he can expect a person or family who can blog or tweet can be subjected to this kind of stuff???
people who are suffering, are neither bloggers nor tweeters!! may the god(Hindu or Christ or Allah) tell him so!
What we need is the exposition of the root of the problem!! not comments!!
of course, guys and gals who spent lots of money to become doctors wouldn't want to serve in rural places!!! fact!!
Mr. Yaramana has any alternative for this???
or he is just asking, go! do that!!just because he did!!!???
everyone has their right to earn money...no one can cut it!!!
or, we are open, if he can suggest us an alternative!
OH....sarath'column, dear, our indian doctors can treat any kind of sexual deceases at a very low price, so, dont worry! they are here for you...go on with your quest, and reserve yourself for the same...because...it seems to be better so!!
one idiot doctor wont represent the entire lot!! above commentators better realize it!!!
and with your idiocy, don't go with Google's suggestions! consult a doctor!
he is the expert! better give him his share!! Ego will have it's limits!
I am still waiting for Mr. Yaramana's reply! what is the alternative???
to produce more doctors?? more Medical institutions??? please give us an idea!! just, don't tell us to go with the flow! please!!
Or..is it like.....there are not enough good students, who can become doctors in andhra?? India??
what is the problem, Sir???
Why we should rely on limited doctors????
Please, explain us...ANYBODY?????
Mr.Sarath, your openness might have earned you applause somewhere else....this is serious stuff...better you not comment on it!! your "" exceptional"" stuff is not ordinary here!!! we are not the USA!
Dear anonymous idiot Tara above!!!!
Shut the fk up jerk, unless you want to display your assholish mind.
డాక్టర్ల మీద మీ అభిప్రాయం 70% నిజం. ఓ సారి పాదం బెణికి నడుచుకుంటూనే ఓ డాక్టర్ దగ్గరికి వెళితే, ఎక్స్-రే అని అనబోయాడు. నేను కాలు విరిగివుంటే తాపీగా నడవడానికి అవుతుందా అని అడగ్గా 'మీకు కావాలంటే చేయించుకోండి' అని అనేశాడు. నాకు ఎందుకు కావాలి? అదెలాగూ ఫ్రేము కట్టించుకుని డ్రాయింగ్ రూములో వుంచుకునే వస్తువు కాదు కదా, వద్దుగాక వద్దు అనుకుని పెయిన్ కిల్లర్ల ప్రిస్క్రిప్షన్ తీసుకుని వచ్చేశాను.
ఎవరెక్కువ డబ్బు లాగితే వాడే మొనగాడు అన్నట్టు, కార్పొరేట్ డాక్టర్ల మీద మీరు వెలిబుచ్చిన సదభిప్రాయం ఆశ్చర్యాన్ని కలిగించింది.
జూడాలవిషయానికి వస్తే, రూరల్ అనుభవానికి ప్రభుత్వోద్యోగాల్లో ప్రాధాన్యత వుండేలా చూడాలి. జనాభాను బట్టి ఆయా ప్రాంతాల్లో పనిచేసిన కాలానికి అనుభవానికి వెయిటేజి వుండాలి. తాక్కువ జనాభా ప్రాంతానికి ఎక్కువ పాయింట్లు వుండేలా విధివిధానాలను రూపొందించాలి. ఇలాంటిదే MDలో ప్రవేశానికీ వర్తింపచేయాలి. అప్పుడు వుద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు రూరల్ ఏరియాలకోసం ఎగబడి వస్తారు. ఉపకారవేతనాలు పొందేందుకు నిభందనలకు లోబడేలా బాండ్లు రాయించుకోవాలి.
ఏమీ ఇవ్వకుండా, డొనేషన్లు కట్టి చదువు లక్షలు పోసి 'కొన్న' జూ వెద్యులను పల్లెల్లో పనిచేయండని నిర్భంధించడం సరికాదు.
>>every service has its price!!! pay it and get it!! don't complain!!!>>
Agreed your excalted Highness!... But shouldn't the victim complain on substandard service???? ...What nonsensical barbarian attitude is this, your excellency!!! ... ???
hee hee hee
నాయనా చక్రవర్తి,
కొంచెం తెలివిగా నడుచుకొన్నచొ, నువ్వు ఇంత బాధ పడుతు బ్లాగులు మీద బ్లాగులు వ్రాయల్సిన అవసరమే రాదు.
తప్పులెన్ను వారు తమ తప్పు లెరుగరు. నీవు మారావని అనుకొన్నాను, కాని నా పిచ్చి భ్రమ!
ఆరుద్ర నక్షత్ర జాతకులు, వారి పని వారు చేయరు ఎదుటి వాళ్ళని చేయనివ్వరు, కాని మొత్తం వాళ్ళకే తెలుసు అనుకొంటారు.
నోరు మంచిదైతే , ఊరు మంచిదౌతుందట!
వైద్యులని చెప్పుకుంటున్న అఙ్ఞాత గారికి,
మొట్ట మొదటగా, మీరు అర్దం చేసుకోక పోగా అపార్దం చేసుకుంటున్నారని మీ స్పందన తెలియజేస్తున్నది. ఆ విషయాన్ని తమరు గమనించకుండా ఎవేవో వ్రాసేస్తున్నారు. ముందుగా ఈ విషయాలను గమనించండి.
౧) శివ చెరువు గారు "ముప్పై రకాల" మందులు అని వ్రాయలేదు. ముప్పై మాత్రలు అని మాత్రమే వ్రాసారు. కానీ మీరు ఆ విషయాన్ని మీరు అపార్దం చేసుకుని, ".. మరీ 30 రకాల మాత్రలు అంటూ రెండు సార్లు స్ట్రెస్ చేయకండి సార్ , ఎవరైనా నవ్వుతారు , ఏ డాక్టరు కూడా 30 రకాల మాత్రలు రాయలేడు , రాయాలన్నా అన్ని రకాలేం ఉండవక్కడ . అది ఫస్ట్ పాయింటు .." అంటూ కొంచం వెటకారాం పాళ్ళకి అపార్దాన్ని తోడు చేసి స్పందించారు. ఇది మీకు అసమంజసం అని మీకు తోచినట్లు లేదు
౨) రొండవది, పాతకాలంలో ఓ సామెత తఱచుగా వినేవాడిని, " వైద్య వృత్తిలో అనుభవం లేని కొత్త వైద్యుడికన్నా చాలా కాలం నుంచి రోగంతో భాదపడుతున్న రోగికి ఎక్కువ తెలుసు .." అన్నట్లు. అనుభవం అన్నింటినీ నేర్పుతుంది అనేది జగమెరిగిన సత్యం. ఎన్నో ఏళ్ళుగా ప్రాక్టీసు ఉన్న ఎంత మంది వైద్యులు x-ray లు, రక్త పరీక్షలు చేయ్యకుండా ప్రధమ చికిత్స చేస్తున్నారు అనేది మీ తోటి ప్రస్తుత కాలం నాటి వైద్యులను అడిగి చూడండి, ఈ నాటి కాలం లోని వైద్యులు వారి అనుభవాన్ని నమ్ముతారో లేక సాంకేతికంగా ఎదిగిన యంత్రాలను నమ్ముతున్నారో మీకే తెలుస్తుంది. పాఠం నేర్పని అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పుకోవటం దేనికో ఒక్క సారి ఆలోచించుకో మనవి.
ఆఖరుగా నేను నమ్మలేదు అని మీరు రూఢీగా నిర్ణయించుకున్నారు. అలా అని నేను ఎక్కడా వ్రాయలేదే!! కాకపోతే నాకు అర్దం కాని విషయం ఏమిటంటే, చేతి వేళ్ళకు మెడ ఎముకకు ఉన్న సంబందం ఏమిటో తెలియక వారు చెప్పారు కాబట్టి తీయించుకున్నాను అని వ్రాయడమే కాక నేను వైద్యాన్ని చదువుకోనందున వారు ఎలా చెబితే అలా చెయ్యాలి తప్ప మనకు మఱో మార్గం లేదని వ్రాసాను గమనించ మనవి.
ముగించే ముందు, ఇది వాదన అని మీరు అనుకుంటున్నారు, కానీ, ఇది ఓ వైద్యుని ఆత్మ ఘోషగా అభివర్ణిస్తున్న మీ స్పందన అని నేను అనుకుంటున్నాను. అలాగే మీ స్పందనకు నా ప్రతి స్పందన తెలియజేస్తున్నాను కానీ మీతో వాదించటం లేదు సుమా. ఇంతటి దానికి మీరు అపార్దం చేసుకోవటం మఱో ఋజువు. ఇంతవరకూ స్పందించి మీ మనో భావాలను తెలియజేసినందులకు ధన్యవాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి