వృత్తి రీత్యా చాలా ప్రదేశాలు తిరిగినా, ప్రస్తుతం భాగ్యనగరంలో స్థిరపడ్డాను. నా వృత్తిలో ఎక్కువకాలం నేను భాగ్యనగరంలోనే గడిపాను అలాగే పెళ్ళైన తరువాత ఆరేళ్ళనుంచి ఇక్కడే ఉన్నాను. కావున ఇంకెక్కడికీ వెళ్ళాలనుకోవటం లేదు. ఇక్కడే ఉంటాను అనుకుంటున్నాను. కానీ కొన్ని నిజాలు నన్ను ఆలోచనలోకి తోస్తున్నాయి. వాటిల్లో మొదటిది ఆత్మహత్యల వివరాలు అలాగే మహిళలపై జరుగుతున్న హింసలపై ప్రభుత్వం చూపిస్తున్న గణాంకాలు. ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చినవి మాత్రమే అని మఱచి పోకుండా, వెలుగులోకి రాకుండా ఎన్ని ఉన్నాయో అన్న భావన మరింత కృంగదీస్తోంది.
భారత దేశంలో హింస గురించి లెక్కా పత్రాలు తయారు చేసే పనిని కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, NCRB, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, వారు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వారి వెబ్ సైట్ నందు 2009 సంవత్సర ప్రతిపాదకపట్టీ ఉంది. వారి లెక్కల ప్రకారం భారత దేశంలో మహిళలపై జరుగుతున్న హింసలలో ఆంద్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని. నమ్మబుద్ది కావటం లేదు కదూ, కానీ ఇది నిజమని లెక్కలే చెబుతుంటే, ఇదా నా ఆంద్రప్రదేశ్ అని ఏడవాలనిపిస్తోంది.
వీరి లెక్కలలో మఱో నగ్న సత్యం ఏమిటంటే, 2009 సంవత్సరంలో ఆత్మహత్యల ద్వారా చనిపోయిన వారి సంఖ్య 1,27,151. అంటే, సంవత్సరానికి 365 రోజుల లెక్కన ప్రతీ రోజు దాదాపుగా మూడువొందల యాభై మంది చనిపోతున్నారు. ప్రతీ నాలుగున్నర నిమిషాల వ్యవధిలో ఒక్కరు చొప్పున గంటకి పదిహేను మంది చొప్పున చనిపోతున్నారంటే, ఎందుకో అర్దం కాని పరిస్థితి. ఇదా నా భారత దేశం అని ఎంత చింతిస్తున్నానో అర్దం కావటం లేదు.
మొన్నా మధ్య అమెరికా వెళ్ళినప్పుడు ఇలాంటి వార్తలనే వారి నేషనల్ మ్యూజియంలో ఉన్నప్పుడు చిత్రీకరించి దానిపై ఓ పుటా వ్రాదామనుకున్నంతలో, హతవిధీ ఇలాంటి నిజాలు అక్కడే కాదు హింసా ప్రవృత్తి ఉన్న ప్రతీ చోట ఇది పునరావృత్తం అవుతూనే ఉంటుంది అనిపించింది. అమెరికాలో ప్రతీ రెండు గంటలకీ పన్నెండు మంది పిల్లలను హత్య చేస్తున్నారన్న విషయం నమ్మలేని మఱో నగ్న సత్యం.
ఇది నేను కల్పించిన చిత్రం కాదు, ఫిలడెల్ఫియాలోని నేషనల్ మ్యూజియం వారు బహిరంగంగా ఉంచినది.
ఎందుకీ హింసా ప్రవృత్తి? .. ఇప్పుడు కాదు, మఱోసారి.

5 కామెంట్లు:
గణళాంకాలు = గణాంకాలు
గణాంకాల్ని బట్టి చూస్తే మహిళల గుఱించి కన్నా మగవారి గుఱించే ఎక్కువ ఆదుర్దా చెందాల్సి ఉంది. ఎందుకంటే దాడులకూ, హత్యలకూ గుఱవుతున్న మగవాళ్లే ఎక్కువ ఆడవాళ్ళ కంటే. ఇవి ముందు నివారించగలిగితే వాటి సంగతి తరవాత ఆలోచించవచ్చు. కానీ ఎందుకో మగవాడు మన రాడార్ లో ఉండడు, ఎన్ని కష్టాలు పడుతున్నా !
ఆత్మహత్యలు.... మనమేమీ చేయలేం.
పిల్లలని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? పిల్లలతోనే హత్య చేసేంత గొడవ పెట్టుకున్నారంటే వాళ్ళు మనుషులే కాదు.
సుబ్రహ్మణ్యంగారు,
అందుకే అంటారండి, నాలాంటి వాడికి తెలుగే సరిగా రాదు, ఇంక భావాన్ని వ్యక్త పఱచడం ఎలా వస్తుందని. ఏది ఏమైనా స్పందించి తప్పుని సరిదిద్దినందులకు నెనరులు. ఇలాగే మున్ముందు చేస్తే నా తెలుగు బాగుపడుతుందని నా అభిప్రాయం కాబట్టి, ఇక ముందు కూడా ఇలాగే చెయ్య ప్రార్దన.
ప్రవీణ్ గారు,
నిజమేనండి, ఎందుకో ఈ విషయం మింగుడు పడటం లేదు. ఒక్క సారి మీరు ఇక్కడ ఉంచిన చిత్రాన్ని చూస్తే అది తీసి దాదాపు ఓ సంవత్సరం దాటి ఉంటుంది. కానీ ఈ విషయం నాకు అవగతం అవ్వక ఇలా ఇక్కద ఉంచానన్న మాట. స్పందించి మీ భావనను తెలియజేసినందులకు నెనరులు
హత్య ఎవరిని చేసినా అది నేరమే. కానీ పిల్లలని హత్య చెయ్యడానికి అంత బలమైన కారణమేముంటుంది? వాళ్ళు డిటెక్టివ్ నవలలు చదివి థ్రిల్ కోసం హత్యలు చేసే సైకోలు అయ్యుంటారు.
ప్రవీణ్ గారు, కారణాలు ఏవైనా, అటువంటి ఆలోచన అలాంటి సంస్కారం అందుకు కారణాలైన సంస్కృతి గురించి ఆలోచిస్తే అసహ్యం వేస్తుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి