నేను అమెరికాకు రెండు పర్యాయాలు వెళ్ళి వచ్చాను. రెండు సార్లు రెండు వైవిధ్యభరితమైన అనుభవాలను మిగుల్చింది. వీటిల్ని ఎప్పటి నుంచో వ్రాయాలనుకుంటున్నాను, కుదరటం లేదు. ఇవ్వాళ మొదలు పెట్టాను, చూద్దాం ఎన్ని రోజుల్లో ముగిస్తానో..
మొదటి సారి | రెండొవ సారి |
౧) అమెరికా ఆర్ధిక మాంధ్యం మొదలైంది | ౧) ఆర్ధిక మాంధ్యం నుంచి బయట పడ్డట్టు వార్తలు వచ్చాయ్ |
౨) ఆరు నెలలు అనుకున్న ప్రయాణం ఎనిమిది వారాలలో ముగిసింది | ౨) రెండు వారాలు అనుకున్న ప్రయాణం పదమూడు వారాలు సాగింది |
౩) మొదటి వారంలో దిగిన హోటల్ నుంచి ఖాళీ చేసి వేరే ఇంటికి మారాల్సి వచ్చింది | ౩) దిగిన చోటే చివ్వరి దాకా ఉన్నాను |
౪) హోటల్ పనిమనుష్యులు నా డబ్బుని దొంగిలించారు | ౪) హోటల్ వాళ్ళు ఒక్క పెన్నీ కూడా ముట్టుకోలేదు |
౫) ఓ రోజు తెల్లవారుఝామున పోలీసు వాళ్ళు నిద్రని పాడు చేసి పోలీస్ స్టేషన్ కి పట్టు కేళ్ళారు. కారణం ఏమిటంటే, నేనుంటున్న ఇంటిలో ఇంతకు మునుపు ఓ దొంగ వెధవ ఉండే వాడంట, వాడి పేరున అరస్ట్ వారెంట్ ఉండటం వల్ల అది నేననుకుని పట్టుకు పోయ్యారు. కాదని ఎంత చెప్పినా వినలేదు | ౪) ఈ సారి పోలీసోళ్ళ గొడవే లేదసలు. |
౬) ఎడారిలో ఒయసిస్సులా కల్పన అక్క | ౬) లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టన్నల్ లా వెరైజన్లో పనిచేసిన సహ ఉద్యోగి హరనాద్ గారు మరియు వారి ఫామిలి |
౭) ఆస్టిన్ తప్పమరే ఊరు చూడలేదు | ౭) వెళ్ళింది రెడ్డింగ్ అనే పల్లెటూరికి, కానీ న్యూయార్క్ లోని మాన్‌హట్టన్ మొదలుకుని, ఫిలడెల్ఫియాలోని పలు పట్టణాలు తిరిగాను. న్యూజెర్సీ లోని సోమర్ సెట్ ప్రాంతలో ఉన్న హరనాద్ వారింటికి, మరియు వారికి దగ్గరలోని మరికొన్ని ప్రాంతాలు. వాషింగ్టన్ డీసీ, మేరీలాండ్, వర్జీనియా, న్యూజెర్సి సిటీతో కలుపుకుని విహారం బాగానే చేసాను |
౮) కల్పన అక్క వాళ్ళు తప్ప మరెవ్వరితో కలవలేకపోయ్యాను | ౮) ముఖ పరిచయంలేని చాలా మంది మెక్సికన్స్ తో కలసి ఎన్నో సాహసయాత్రలు చేసాను అలాగే వారి గెట్ తుగెదర్స్ కి అటెండ్ అయ్యాను |
౯) క్లైంట్ చాలా బాగా చూసుకున్నాడు | ౯) క్లైంట్ బాగా చూసుకోలేదు అని చెప్పలేను కానీ బాగా చూసుకున్నాడు అని మాత్రం చెప్పలేను. |
౧౦) అహారం మరియు చిరు తిండి విషయాలలో ఇక్కడ ఎలాంటి కొరత లేకపోయింది | ౧౦) అహారం విషయం ప్రక్కన పెడితే, మంచినీళ్ళుకూడా కొనుక్కోవలసి వచ్చింది |
౧౧) క్లైంట్ ఫెసిలిటీస్ బాగా ఇచ్చాడు. తాగడానికి కూల్ డ్రింక్స్, తినడానికి రకరకాలైన తిను బండారలతో బాటుగా, ప్రతీ రోజు రకరకాలైన స్నాక్ ఇచ్చేవారు | ౧౧) ఉచితమా!! అంటే ఏమిటి? |
౧౨) క్లైంట్ దగ్గర పనిచేసే వారందరి కోసం వారాంతంలో ఇంటికి పట్టుకెళ్ళేందుకు కూడా లెఫ్ట్ ఓవర్స్ ఉండేటట్టుగా ఆర్డర్ చేసే వారు | ౧౨) హూ!! What language am I using and what is the grammar of the language? |
౧౩) అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న వైనంలా, నేను వెళ్ళిన కార్యక్రమం పతాకస్థాయికి చేరుకునేటప్పటికి క్లైంట్ వాళ్ళని మరో కంపెనీ కొనేసి మానోట్లో మట్టి కొట్టింది | ౧౩) వెళ్ళింది ఒక పని పై అయితే, నా పని తీరు నచ్చి మరో రేండు పనులు చేయించుకుని, రెండు కొంటే ఒకటి ఉచితం అన్నట్లుగా ఓ చిన్న ప్రాజెక్టుని ఇండియాకి పార్శిల్ చేసారు |
౧౪) నాలుగు రాళ్ళు వెనకేసుకోవాల్సిన నేను ఉన్నది పోగొట్టుకుని, ఉంచుకున్నదాని పోగొట్టు కోవాల్సి వచ్చింది. అంటే ఇండియాలో ఉన్న ఉద్యోగం కూడా పోయింది | ౧౪) నాలుగు వెనకేసుకుందాం అనుకుంటే, రోజుకి పది డాలర్ల బోనస్ గా క్లైంట్ ఇచ్చాడు. అలా నాలుగు కాస్తా ఐదు అయ్యింది. లాభదాయకమే |
౧౫) భోజన పరంగా ఇబ్బంది కలగలేదు. వీకెండ్స్ లో కల్పనక్క వాళ్ళింట్లో చక్కగా భోజనం అలాగే ఓ రెండు కూరలు వండుకుని తెచ్చుకునే వాడిని. అలా సోమ మంగళ వారాలు గడిపేస్తే, భుధ గురువారాలకు ఏదో చేసుకుని తినేసే వాడిని. ఇక శుక్రవారం నాటికి మళ్ళీ అక్కావాళ్ళింటికి చెరుకునేవాడిని.. | ౧౫) ఆఖరి రోజుల్లో చాలా ఇబ్బంది అయ్యింది. మొత్తం మీద ఇబ్బంది కరంగానే సాగింది |
౧౬) తిరుగు ప్రయాణం అసహనంగా గడిచింది | ౧౬) తిరుగు ప్రయాణం బాగా జరిగినా, రెడ్డింగ్ చేరుకునే టప్పుడు పలు చికాకులు, అలాగే ఇరవై నిమిషాల విమాన ప్రయాణానికి ఎనిమిది గంటలు వేచి చూడవలసి వచ్చింది |
౧౭) వచ్చేటప్పుడు ఇంట్లో వారికోసం తెచ్చిన సామానులలో ఓ పెద్ద బ్యాగ్ ఆమ్స్టర్ డామ్ ఏయిర్పోర్ట్ లో తప్పిపోయింది. దానికి ఎటువంటి రికవరీ అందలేదు | ౧౭) ఈ సారి హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు కుమ్మేసారు |
౧౮) క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు ఓ ఐదు నెలల పాటు అనవసరమైన పేమెంట్స్ చెయ్యాల్సి వచ్చింది | ౧౮) క్రెడిట్ కార్డ్స్ వారికి ముందుగా తెలియ జేసినా, అవి పని చెయ్యలేదు |
౧౯) బంధు మిత్రులను ఎవ్వరినీ కలవలేదు | ౧౯) మా పెద్దనాన్నగారి పిల్లల్ని వారి పిల్లల్ని కలిసాను |
౨౦) మొత్తంగా చెప్పాలి అంటే, ఆదాయం ౩ ఖర్చు ఏడు | ౨౦) అదాయం ఆరు ఖర్చు నాలుగు |
16 కామెంట్లు:
కమల్,
ఇప్పటికీ నిన్ను వీకెండ్స్ గుర్తు చేసుకుంటాము. ముఖ్యం గా అఫ్సర్ గారు నిన్ను, నీ వంట ను మిస్ అవుతున్నారు. మళ్ళీ వచ్చేశాయి ఆస్టిన్ కి...నీ 5 వ నెంబర్ బస్ రూట్ అలాగే వుంది పెద్దగా మార్పులు లేకుండా.
Very interesting analysis.
I always suspected that the USA is not very friendly to visitors. It is not bad if you're here for just a week or so, but if a visit is more than a week but less than a year, it is probably very inconvenient.
Only now, Starbucks and many other food places are offering free wi-fi access. Earlier, you had to locate a public library to check your email.
One q - how did you do this table?
Is there some HTML code?
Would you share?
చెత్తపాళీ, ఇది చూడు-
http://www.quackit.com/html/codes/html_table_code.cfm
Very nice and interesting analysis.
అక్కా,
అఫ్సర్ అలాగే అనిందు ఇద్దరూ చెరిగిపోని గుర్తులుగా మిగిలిపోయ్యారు. ఈ సారి కనుక ఆస్టిన్ వస్తే తప్పని సరిగా డెల్ లో ఉద్యోగం తప్పని సరిగా కొట్టేస్తా. వచ్చేసంవత్సరం H1 చేయించుకుంటా అప్పుడు అలాగే చేద్దాం.
శర్మగారు,
మున్ముందుగా అమెరికా లో ఈ మధ్య పెరుగుతున్న సదుపాయాల గురించి వివరించినందులకు ధన్యవాదములు. ఇక మీ ప్రశ్న విషయానికి వస్తే, నేను బ్లాగులో పోస్టులు వ్రాయడానికి విండోస్ వారి లైవ్ రైటర్ వాడతాను. అందులో మీకు సోర్స్ అన్న టాబ్ ఉంటుంది. అక్కడ మీరు HTML ఉంచవచ్చు, అలా కాని పక్షంలో చక్కగా EDITలోనే టేబుల్ ని ఇంసర్ట్ చెయ్యవచ్చు. ప్రయత్నించండి, ఒక వేళ కాకపోతే సహాయం చేస్తాను
హైద్రాబాద్‌లో కస్టమ్స్ వారు కుమ్మిన విధం బెట్టిది? :))
ఒక వివరమైన టపాలో తెలుసుకో గోరుతున్నాను.
చూడు మిస్టర్ లీడర్,
ముందుగా మీరు అసబ్య పద ప్రయోగాన్ని మానుకోమనవి. మీ స్పందనను తొలగించవచ్చు, కానీ మీరు అప్రయత్నంగానైనా సహాయపూరకంగా స్పందించి లంకెని ఇచ్చినందున తొలగించడం లేదు. ఇకపై నైన పెద్దవారిని గౌరవించకపోయినా పరవాలేదు అని ఊరుకోను కానీ అగౌరవపరిస్తే మాత్రం క్షమించేది లేదు అని గుర్తుంచుకో.
పానీపూరి గారు,
ఈ మధ్య కనిపించడం లేదు, పూర్తిగా నల్ల పూసై పోయినట్టున్నారు. ఏమైనా స్పందించినందులకు నెనరులు
ఆ హైద్రాబాద్ కస్టమ్స్ వాళ్ళు మరీ లేకీ గాళ్ళు. కొద్దిగా బెదిరిద్దామని చూశారు, నేను వాడికి కస్టంస్ రూల్స్ కాపీ చూపించా. ఆడ ఆఫీసర్లైతే మరీ సఫాయీ కర్మచారీ లకు తెల్ల యూనిఫాం వేసినట్టుంటారు. ఏదో మీకు తోచింది ఇవ్వండి సార్ అని కస్టంస్ జవాన్లు చేచాచి అడుక్కున్నారు. సాచి కొట్టాలని తోచినా నాకిపుడేమీ తోచట్లేదోయ్ అని వచ్చేశా.
మొదటి అజ్ఞాతగారు,
వద్దులేండి వాళ్ళని తలచుకోవాలంటేనే అసహ్యంగా ఉంది. వీలైతే మరో సారి గుండే దిటవు చేసుకుని వ్రాస్తాను. ఎంకరేజ్ చేసినందులకు నెనరులు
రెండొవ అజ్ఞాత గారు,
మీరు మొదటి అజ్ఞాతగారేనా, లేక మరొకరా!! మీవద్దనున్న సమాచారాన్ని నాలాంటి వారితో పంచుకోవచ్చు కదా, అప్పుడు మాలాంటి వారు ఆ అయుధాన్ని వాడే వాళ్ళం. ఏమైనా , మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు
I suspect that leader is Srinivas(vikatakavi)
Third anonymous,
Who cares.. i damn look for what these folks are upto. Anyhow, thanks for commenting
కొంతమందికి నా పేరు తల్చుకోనిది రోజు గడవదు అనుకుంటా! :) నన్ను చాలా పాపులర్ చేసేస్తున్నారోయి
శ్రీనివాస్,
పేరులేని అనామకులు మరియు ముసుగు దొంగలు జాల ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారిలో కొంతమంది వారిగురించి వారే గొప్పలు చెప్పుకుంటూ పొంగి పోతుంటారు. వాపుకి బలుపుకి చాలా తేడా ఉందని నేను వేరేగా చెప్పనక్కరలేదు. అలా మీరు మీగురించే అజ్ఞాతగా వ్రాసుకున్నారనేటు వంటి భావన వచ్చేటట్టు స్పందించకండి. ఒకవేళ నిజ్జంగా ఎవ్వరైన స్పందిస్తే అందుకు కారణాలేమిటో ఆలోచించుకోండి. అది వారి అభిమానం అవ్వవచ్చు లేదా మీరు స్పందించే తీరు అనుభవం అయ్యుండొచ్చు. ఏమైనా స్పందించినందులకు నెనరులు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి