ఉపోధ్ఘాతం : ఈ పుట అప్పుడెప్పుడో సగం వ్రాసి డ్రాఫ్ట్ గా సేవ్ చెయ్యబడి ఉంది. ఇదిగో ఇప్పుడు వీలు కలిగి మీముందుకు ఇలా..
-----------------
నా భార్య నాపైన చేసే కొన్ని కంప్లైంట్లలో ఒకటి నన్ను ఈ పుట వ్రాసే ప్రయత్నం చేసింది. నా భార్య మాటల్ని యధాతధంగా ఇక్కడ ఉంచడానికి ప్రయత్నం చేస్తాను..
ఇంటికి వచ్చిన తరువాత కాళ్ళు కడుక్కుని ఏదో రెండు ముక్కలు నాతో మాట్లాడతారని నేనుకుంటుంటే.. ఏదో పోయినోడిలాగా వచ్చీ రాగానే ఆ వెధవ టీవీ ముందు అలా అతుక్కు పోవడమేమిటో నాకర్దం కాదు.. ఇంతకీ షూ తీసారా!!! ఆ కాళ్ళు కంపు కొడుతున్నాయి పోయి కాళ్ళైనా కడుక్కు రండి.. ఈ లోపుల నేను వేడి వేడిగా తిండానికి ఏమైనా చేస్తాను.. ఏంటీ!! వింటున్నారా!! నేను చేప్పేవి వినబడుతున్నాయా!!
మన భారతంలో కొద్ది మందికి క్రికెట్ అనే ఆట ఒక మతంలాంటిది. క్రికెట్ ఆట జరిగుతోందంటే ఆ ఆట గురించి తెలిసిన వారెవ్వరైనా అడిగే మొదటి ప్రశ్నలలో కొన్ని, ఎవ్వరాడుతున్నారు.. ఎన్ని రన్స్ చేశారు.. ఎన్ని వికెట్లు పడ్డాయి.. ఎవ్వరెవ్వరు అవుట్ అయ్యారు.. వగైరా వగైరా.. అలాంటి వాళ్ళల్లో నేనూ ఉన్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి