నా జీవితంలో కొన్ని కొన్ని కోరికలు తీరకుండా పోతానేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలా అని చెప్పి గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు కానీ తీరడానికి అనువైనవే అని చెప్పొచ్చు. అలాంటి వాటిల్లో ఒకటి నా కుటుంబం పిల్లల్లు గురించి నేను ఈ క్రింది విధంగా చెప్పుకోవాలని కోరిక
నేను.. చదువు రీత్యా పోస్టు గ్రాడ్యుయేట్.. వృత్తి రీత్యా బ్రమ్మి.. ప్రవృత్తి రీత్యా నృత్యకారుణ్ణి.. వీలైతే చదరంగంలో క్రీడాకారుడిగా రిటైర్ అవ్వాలని కలలు కంటున్నవాడిని. హాపీలీ మారీడ్ టు ఏన్ ఇన్డిపెన్‍డెంట్ టెక్నికల్ కాంన్సల్టెంట్. మాకు ఓ కూతురు మేము మరో అమ్మాయిని దత్తత తీసుకున్నాం. వీరిద్దరినీ చక్కగా చదివించాం. వీరి భవిష్యత్తు వీరి చేతుల్లో ఉంచి మేము ఈ తనువు చాలించాం
పైన పరిచయ కార్యక్రమం లో చాలా “నేను” దాగి ఉంది కదా.. ఏమి చేస్తాం.. స్వార్ధం... ఈ సదురు నేను నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా బయటకు రాలేక పోతున్నాను. ఇప్పటికే మూడింట రెండొంతుల జీవితం అయిపోయింది. ఇప్పటికైనా నేను లోంచి మేము లోకి ఎప్పటికి వస్తానో అర్దం కావటం లేదు. ఏది ఏమైనా, ఈ కోరికలు తీరనంతగా లేవని నా అభిప్రాయం.
మరి మీరేమంటారు?
3 కామెంట్‌లు:
మీకు హృదయపూర్వక అబినందనలు
http://jeevani2009.blogspot.com/2010/01/blog-post_12.html లో చెప్పిందీ ఇదే.మీవల్ల తప్పక అవుతుంది. మొదటి సంతానం కలిగాక అక్కడితో ఆపేసి, రెండో పాప బాబు కావాలనుకున్నపుడు ఒక అనాధను దత్తత తీసుకోవాలి . దీనివల్ల ఒకరికి పూర్తి స్థాయి జీవితాన్ని ఇవ్వగలిగినవారు అవుతారు.ఇలా జనాభా సమస్య అరికట్టవచ్చు.ఒక అనాథకు జీవితం ఇవ్వవచ్చు.
అలాగే పిల్లలు లేనివారు ఏళ్ళతరబడి అలా పిల్లలకోసం ఖర్చు పెట్టుకునే బదులు దత్తత తీసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా ఈ వైద్యంలో ఆడవారికి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి మరోరకమైన హింస. వర్తమానాన్ని ఆనందించడం మాని చాలామంది భవిష్యత్తు కోసం బాధ పడుతుంటారు. విసిగివేసారిన దంపతులకు ఆ పాప / బాబు రాక అంతులేని సంతోషాన్ని ఇస్తుంది. దాన్ని ఆస్వాదించాలి. సమాజం, బంధువులు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ మొదట వదిలేయాలి. మనం జీవిస్తోంది మనకోసం. మనం ఎవ్వరికీ హాని చేయడం లేదు.
ఏమి చేసినా ఎన్ని సాధించినా మనం మూటగట్టుకు పోయేది ఏం లేదు.పిల్లలు లేని జంటలు ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలోని ICDS కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పిల్లలు తీసుకోవడానికి పట్టే రెండు మూడు సంవత్సరాల లోపు పిల్లలు కలిగితే దాన్ని రద్దు పరచుకోవచ్చు.
సొంతబిడ్డలు మాత్రమే కావాలనే పట్టుపట్టి సంతాన సాఫల్యకేంద్రాలలో డబ్బు ఖర్చుపెట్టకుండాఅనాధ శిశువులను పెంచుకోవటమే నిజమైన దేశభక్తి ,మానవసేవ,మాధవసేవ కూడా.
బాగున్నాయి మీ కోరికలు. ఈ టపా రాసే టప్పటికి ఇంకా "మేము" కాలేదు అని అర్థమయ్యింది. ఎంత వరకూ వచ్చాయి ప్రయత్నాలు? దత్తత తీసుకున్నారా? మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి