9, మే 2009, శనివారం

పండంటి బ్లాగింగ్ కి పది సూత్రాలు : నా రికమెండేషన్స్

క్రిందటి పుటలో ఉపోధ్ఘాతం చదివి ఉంటారని తలుస్తాను. లేకపోతే ఓ లుక్కేసుకోండి. ఇక అసలు కధలోకి వద్దాం. ఇక్కడ నేను చెప్పే లేదా ప్రస్తావించే విషయాలు ఆరోగ్య కరమైన మరియూ వివ్వాదస్పద రహితమైన బ్లాగింగ్ కోసం అని మాత్రమె. అందువల్ల నేనెవర్రినీ ఉద్దేశించి వ్రాస్తున్నానని తలంప వలదు.

క్రిందటి పుటలో శరత్ గారు స్పందించినట్లు పది సూత్రాలే ఉండాలా!!! ఏం 12 ఎందుకు ఉండకూడదు!! అస్సలు ఇన్నే ఉండాలి అని ఎవ్వరు చెప్పారు..?? నేనేమన్నాపెద్ద పుడింగా!! నిన్నో మొన్నో వచ్చా.. త్రిప్పి త్రిప్పి తిరగేసి చూస్తే ఓ వంద పుటలు వ్రాసాడో లేదో  ఇంతలో ఏవో ఙ్ఞాన భోధలా…ఆ!! అనుకుంటున్నారా.. ఏదైనా మొదలు పెట్టే మ్రుందుగా అందరూ అర్దం చేసుకోవాల్సిన విషయమేమిటంటే … ఆంగ్లంలో చెప్పినట్లుగా .. Birds of same feather walk together.. అట్లా మన ఆలోచనలకి దగ్గరి దగ్గరగా ఆలోచిస్తున్న వాళ్ళందరూ మన వాళ్ళే అంటూ, అనుకుంటూ మనకు తెలియకుండానే గుంపులు కట్టేసుకుంటాం. అట్లా.. గ్రూప్ లు తెలియకుండానే ఏర్పడి పోతూ ఉంటాయి. నా ప్రమేయం లేకుండా నేను ఏదో ఒక గుంపులో సభ్యుడనవుతాను.

తెలుగు మైక్రో బ్లాగింగ్ సౌకర్యమైన కువకువలులో మొన్నామధ్య చెప్పినట్లుగా..

<<మనం ఎదైనా choice చేసుకున్నాం అనుకోండి, మనతో ప్రమేయం లేకుండా మన mind ఆ choice ని సమర్దించే ప్రయత్నంలో సకల మార్గాలను కనుగొంటుంది>>..

మనల్ని మనం సమర్ధించుకుంటూ మన గుంపులో గుర్తింపు కోసం కాక పోయినా మన ఆలోచన <<ఆదిపత్య>> పోరు చేయ ప్రారంభిస్తాము. ఇలాంటి స్వాభావం మంచిదా చెడ్డదా అని నేను తర్కించను.  కానీ వివాదాలకు దూరంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో బ్లాగింగ్ చెయ్యాలనుకునే వాళ్ళకి కొన్ని సూచనలు ఇద్దాం అని నేను చేసే ఈ ప్రయత్నంలో ఏవైనా అపసృతులు దొర్లితే మీ అనుభవంతో మీరు నేర్చుకున్న గుణ పాఠాలను మాతో పంచుకోండి. నా సలహాలు సూచనలు ఆలోచనలు ఇలా ఉన్నాయి ..

౧) ఏంత కాదు ముఖ్యం కానీ ఏమిటి అన్నది

ఎంత వ్రాసాము అనేది ముఖ్యం కాదు .. కానీ ఏమి వ్రాసాము అనేదు ముఖ్యం అని గుర్తు పెట్టుకోండి. ఆంగ్లంలో చెప్పాలంటే, Quantity కాదు ముఖ్యం కానీ Quality ముఖ్యం. చెత్త వ్రాతలు పుంఖాలు పుంఖాలు గా ఎంత వ్రాసినా అది ఎవ్వరికీ లాభం లేదు, ఏదో లెక్కకు ఇన్ని వ్రాసాను అన్న ఆత్మ తృప్తి తప్ప. కాబట్టి ఏదైనా ప్రచురించేటప్పుడు దానిలో ఎంత Quality ఉన్నదో అని ఆత్మ విమర్శ చేసుకోండి .. << ఇంత సుత్తి అవసరమా..??>>

౨) ఆద్యంతం ఒక్కటే ఆలోచనగా ..

ప్రచురించే పుట ఆది నుంచి అంతం వరకూ ఒక్కటే ఆలోచనగా సాగించండి. బండి గాడి తప్పి ప్రక్క దారులు త్రొక్కకుండా చూసుకోండి. ఆంగ్లంలో చెప్పాలంటే, stay on topic every time and all times

౩) ఆస్వాదించండి .. ఆనందించండి..

మీరు వ్రాసే ప్రతీ పుటని మ్రుందుగా మీరు ఆశ్వాదించండి. హాయిగా నవ్వుకునే విధంగా ఉందని మీకు అనిపిస్తేనే ప్రచురించండి. అంతే కానీ నవ్వులుపాలుకాకండి. మీ పుట ద్వారా హాస్యం జనించక పోయినా పరవాలేదు కానీ అపహాస్యం ఉత్పన్నం అవ్వకుండా జాగ్రత్త పడండి

౪) చర్య – ప్రతి చర్య(గా బ్లాగకండి) లకు దూరంగా ఉండండి

అంటే, ఎవ్వరైనా సహ బ్లాగర్లు ఏదైనా పుట ప్రచురించారనుకోండి, ఆ విషయంపై మీస్పందనలను వారి పుటలో తెలియ జేయండి. అవి అక్కడ ప్రచురణకు నోచుకోలేదనుకోండి, ఆ చర్యకు ప్రతి చర్యగా మీ బ్లాగులో మరొ పుటను ప్రచురించారనుకోండి అది ప్రశ్చన్న యుధ్ధానికి  దారి తీస్తుంది. ఇలా మీ బ్లాగుని వివరణ(ల) పూటల పరంపరలతో నింపేయ్యకండి. మీరెవ్వరికీ జవాబుదారులు కాదు. మీకు మీరే రాజూ మంత్రి. మీ బ్లాగే మీ రాజ్యం. అది శత్రు దుర్భేధ్యం. ఆంగ్లంలో చెప్పాలంటే Reactive గా ఉండకండి, ProActive గా ఉండండి. ఈ విషయాం మీద పుంఖాను పుంఖాలుగా వ్రాయవచ్చు కానీ ఇక్కడ ముగిస్తాను. ఇంకా వివరంగా చర్చించాలంటే మనం మనం విడిగా వేరే ఎక్కడైనా ..

౫) ఆఖరుగా.. వివాదభరితమైన ప్రచురణలకు దూరంగా ఉండండి..

అంటే, అలాంటి ప్రచురణలు చెయ్య వద్దు అనికాదు, కానీ ప్రచురించేటప్పుడు కొంచం ధైర్యాన్ని కూడ దీసుకుని ప్రచురించండి. అందరూ ఒకేలాగా ఉండరు అలాగే ఒకె లాగా ఆలోచించరు, అందుకని మన మనః శాంతిని కొల్లగొట్టే వారు చేసే సకల ప్రయత్నాలను గంగ పాలు చేసేయ్యండి. అంతే కానీ మీ ప్రపంచాన్ని దూరం చేసుకోకండి.

ఇలా చాలా విషయాలు చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ముగిస్తాను. మీ స్పందనలకై ఎదుఱు చూస్తూంటాను

5 కామెంట్‌లు:

Aruna చెప్పారు...

nice

Unknown చెప్పారు...

mee prayatnam baagundi.blogger la samskaaram penchadaaniki ilaantivi thodpadathaayi.p.v.ramarao.proddatur.

అజ్ఞాత చెప్పారు...

sir, అసలు బ్లాగింగ్ చెయ్యకుంటే సరి ..

ఓ బ్రమ్మీ చెప్పారు...

హరనాద్ గారు,

బాగుందండి.. ఆ లెక్కన ఏమీ అక్కరలేదు ..

అజ్ఞాత చెప్పారు...

మీ టైటిల్ సూపర్ గా ఉంది : "పండంటి బ్లాగింగ్ కి పది సూత్రాలు" !

మీ పాయింట్లు బావున్నాయి;

నేనూ ఓ పట్టు పడుతున్నాను ; కాస్కోండి.

1.ఏమిటీ సంగతి?
పాప ఏడ్చింది; నాకు ప్రేమ పుట్టింది; నాకు కోపం వచ్చింది; ఏడుపొచ్చింది; ఆమె నవ్వింది; అతడి చూపు నచ్చలేదు లాంటివే ఎప్పుడూ రాయకుండా, పీరియాడికల్ గానైనా ఏదన్న సబ్జెక్టు మాటెర్ రాయడానికి యోచించండి. సబ్జెక్టు గురించి రాస్తున్నప్పుడు, మరిన్ని దృక్కోణాలు మనకి తెలియడమే కాకుండా, మరికొంతమందికి తెలిసేలా చేస్తాం. ఇలాంటి భావసారూప్యతల్లో, భావ వైరుధ్యాల వల్ల కూడా మంచి స్నేహాలు, శతృత్వాలు చేసుకోవచ్చు. అది మీ మైండ్ ని చాలా యాక్టివ్ గా ఉంచుతుంది. హ్యాపీ గా ఉండొచ్చు. లేకపొతే, తెలుగు బ్లాగులు అన్నీ ఒకేలా ఉండటం వల్ల పెద్దగా స్నేహాలుగానీ, శతృత్వాలు గాని ఏర్పడవు; బ్లాగింగ్ ఈజ్ ఏ సోషల్ యాక్టివిటి. మీ పర్సనాలిటీని, ఇప్పుడు సంఘంలో ఉన్నదానికంటే కూడా, ఈ బ్లాగింగ్ సొసైటీలో - మీరు భిన్నమైన, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ, ఆనందించవచ్చు. అలాగే "అష్ట చెమ్మా" సినిమాలో హీరోలాగా, మీరు బయటి ప్రపంచంలో "పెదరాయుడు" ఐతే,ఇక్కడ "మహేష్" అవ్వచ్చు! :)

౨.శైలి - స్టైలే స్టైలే ...... :
మీదైన ఓ శైలి కోసం పాకులాడండి; ఇది అంతా ఇజీగా దొరికేదు కాదు. మీ ఆలోచనలాగనే రీడర్ కూడా ఆ "అల" మీద సర్ఫ్ చేసేలాగా జాగ్రత్త పడితే మంచింది; లేకపోతే పోయేదేం లేదు; రీడర్ ముందు నీళ్ళలో పడిపోయి, వేరే చోట తేలిపోతాడు. అంతే! :)

౩.ఆనందించండి:
మీరు రాసేదేదైనా మీకు ఆనందం కలిగిస్తే,మరొకరికైనా ఆనందం కలిగించవచ్చు; మీర్రాసిన దానివల్ల ఎవరో దు:ఖ పడాలని మాత్రం మీరు కోరుకుంటే, అది బుమారాంగ్ అవటానికి ఛాన్స్ ఎక్కువ. సో ఏడిపించి ఆనందించటం అనే ప్రక్రియలో , ఈ విషయం గుర్తు పెట్టుకొని ట్రై చేసుకోండి.మీరిది బయటి ప్రపంచంలో చేసేదే ఐతే,కొత్త విషయం ఎలాగూ కాదు. :)

౩.చర్చించే విధంగా బ్లాగండి:
ఉత్తర ప్రత్యుత్తరాలు ఒకరిద్దరు రాసుకుంటే, ఆ ఆలోచనలు వాళ్ళ మధ్యే ఉంటాయి. అదే బ్లాగులో రాసినప్పుడు, పలురకాల ఆలోచనలు మీకొస్తాయి; దాని వల్ల మనసు ఆకాశం అంత పెద్దదని తెలుస్తూ ఉంటుంది; దూరదూర తీరాల నిండ వచ్చిన మనసుల అనుభాల ఆనందఆశ్చర్యాలను కలిగిస్తాయి.కానీ అందులోని కామెన్ నెస్ కూడా చూడవచ్చు.(మనస్తాపాన్ని కలిగించవచ్చు- మనస్సు కద!); చర్చించడం అంటే, నా అభిమతమే నెగ్గాలీ అని కాదు; పలు రకాల దృక్పదాలలో ఒక విషయాన్ని చూడటం అన్నమాట. గెలవటానికే రాద్దామనుకుంటే కూడా, ఓ విషయం గుర్తుపెట్టుకోండి; ఎప్పుడూ మీరే గెలిస్తే, ఇక జనాలు మిమ్మల్ని ఓడించే ప్రయత్నం చేయరు; దెన్, దేర్ ఈజ్ నో గేమ్..యూ సీ :)

౪ వ్యతిరేక భావం ఊహించండి :
ఒకోసారీ పలు రకాలుగా రాబోయే ప్రతిస్పందనలు ఒకోసారీ ముందే మనం ఊహిస్తాం; దానికి సిద్ధపడి, అలాంటి విషయాన్ని రాయాలి; ఇన్ ఫాక్ట్, దేనికైనా, మరో వ్యతిరేక భావం ఉంటుంది అని తెలిసిన రోజు, మీరు దీనికి అంతగా భయపడరు; కానీ అనుభవానికి రానప్పుడు, మీర్రాసేదానికి వ్యతిరేక భావం ఉన్నదా అని ఆలోచించుకొని సిద్ద పడటం, మీ ఆలోచనకే పదను పెట్టడం అన్నమాట. లేనప్పుడు, బి రెడీ టు సీ వాట్ కుడ్ బి ది ఆపోసిట్ వ్యూ పాయింట్! :)

అరే! ఇవి పది లేవు! ఐదే ఉన్నాయి!

 
Clicky Web Analytics