14, అక్టోబర్ 2008, మంగళవారం

ఎందుకీ స్తబ్తత?

 

రోజూలాగే ఈ రోజు మొదలైందనుకున్నాను. కానీ ఏదో తెలియని నిస్సత్తువ. మనసంతా ఒక్కసారే శూన్యమైపోయింది. ఏమి చేస్తున్నానో.. ఎందుకు చేస్తున్నానో నాకే అర్దం కావటం లేదు. రోజూ లాగే, ఉదయానే లేచి కాలకృత్యలతో పాటుగా స్నానం అయ్యిన తరువాత అన్నం వండుకున్నా.. ఆఫీస్ లో తినడానికి కారియర్ సద్దుకున్నా.. ఆపిల్స్ తిన్నా.. సాయంత్రానికి బ్రెడ్ జామ్ మూట కట్టుకున్నా.. అంట్లు తోమి ఆరబెట్టాను. ఇన్ని చేస్తున్నా.. ఏదో శూన్యం .. యాంత్రికంగా చేసేస్తున్నా. నా ప్రమేయమేమీ లేకుండా అన్ని జరిగి పోతున్నాయి. అప్పుడు గుర్తుకొచ్చింది. చక్కగా కర్ణాటక సంగీతం వినవచ్చు కదా అని. అన్నదే తడవుగా esnips నుంచి దించుకున్న పాటలు గుర్తుకొచ్చాయి. ఏమ్ ఎస్ సుబ్బలక్ష్మి.. బాల మురళీ.. వంటి ఎందరో మహానుభావులు పాడిన గీతాలు అక్కడ ఉచితంగా దొరుకుతున్నాయి.


చూసారా.. ఇప్పుడు కూడా ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో పోతున్నా.. దిశ నిర్దేశం లేకుండా.. ఏమిటిది.. ఎందుకిలా జరుగుతోంది. అప్పుడెప్పుడో ఒకసారి నాలోని ఆలోచనలన్నీ ఒక్కసారిగా కట్ట కట్టుకుని మూట ముల్లె సర్దుకుని నానుంచి నన్నడగకుండా సెలవు తీసుకుని వెళ్ళిపోయాయి. ఎంతో కష్టపడి.. ఎన్నో వ్యయ ప్రయాశలకు తలలొగ్గి తిరిగి మామూలు స్తితికి వచ్చేటప్పటికి తలలోని ప్రాణం కాస్తా తోకలోకి వచ్చినంత పనైంది. మరి ఇప్పుడేంటి?? ఆలోచనలే కాదు.. మొత్తం భవిష్యత్తంతా శూన్యంగా తోస్తోంది. నాకు తెలిసినంత వరకూ వైరాగ్యాలు నాలుగు రకాలు. శ్మసాన , శృంగార, భక్తి మరియు ప్రసవ సమయాల్లో కలిగే భావనలే ఆ నాలుగు రకాలు, అని చిన్నప్పుడెప్పుడో మాతాతయ్య గారు చెప్పగా విన్నట్లు గుర్తు. తప్పైతే సరిదిద్ద గలరు. ఇప్పుడు నేనున్న పరిస్తితి వైరాగ్యమా!!! అయితే ఎలాంటిది? అర్దం కావటం లేదే..


అయిన వాళ్ళకి దూరంగా ఉన్నందునా ఈ స్తబ్తత? కానీ వృత్తి లేనిదే భుక్తి గడవదుకదా.. వృత్తి ధర్మం ముఖ్యమా !!! ప్రవృత్తి ముఖ్యమా!! ఏది ఆలోచించుకోవాలి.. ఏమిటిది? నాలో ప్రశ్నలు పుంఖాను పుంఖాలుగా పుట్టుకొస్తున్నాయి? అన్నీ ఉన్నా ఏమీ లేని భావనను ఏమనుకోవాలి? ఇది నాకేనా.. ఇలాంటి భావన నాకే ఎందుకు కలుగుతోంది? నాలో ఏమి లోపించింది? అందరిలాగా నాలో ఉండాల్సిన భావ రాగ ద్వేష కోప తాపాలు ఎక్కడికి పోయ్యాయి? ఈ శూన్యం నన్ను ఎక్కడికి తీసుకు పోతోంది?

 

హమ్మో ఇన్ని ప్రశ్నలే.. వీటిలో దేనికైనా మీ దగ్గర బదులున్నట్లైతే, విన్నవించి ఆదుకో గలరని మనవి.
ఇట్లు
భవదీయుడు

10 కామెంట్‌లు:

Bhãskar Rãmarãju చెప్పారు...

బాసు!! నీ గోల (I mean problem) నాకు అర్ధం అయింది. ముందు ఇది చెప్పు. నీకు పెళ్ళి అయిందా? కాకపోతే పెళ్ళిచేస్కో తొందరగా.. పెళ్ళిఅయితే ఇలా అనిపించదు, అనిపించకూడదు... ఎందుకంటే ఇంకోలా అనిపిస్తుంది కాబట్టి. :):)

Well, This is not for fun, something serious, If u feel like boring, read books, or jog, jog man jog, or do visit gym, or try out new వంటకాలు, or think about virtualization, how can u run two operating systems parelelly, have linux on ur desktop.
Best thing u can do is, have some funny projects. Like, imagine you have a kid arround u or ur home, ur sis's son/daughter or ur brother's son or daughter etc, think about how to make a barn and put animals in it. take some cardboard, make a barn. shoot the process, put it in youtube. or take a piece of paper, draw a sheep, stick cotton to look like a sheep with fur. There are n number of ways to come out that FEELING and invest in things can be of use for people like me who have kids.

స్థబత అనేది కేవలం illusion.

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మాయాబజారులోని శాస్త్రి శర్మల ద్వారా పింగళి నాగేంద్ర రావు గారు చెప్పారు...ఒక సారి మళ్లీ శ్రద్ధగా వినండీ ..

ఓ బ్రమ్మీ చెప్పారు...

భాస్కర్ గారూ..

నాకు పెళ్ళి అయ్యిందండి. ప్రస్తుతానికి భార్యా వియోగంతో పరదేశంలో నివసిస్తున్నాను. పిల్లల యూగం ఇంకా కలగలేదు

Infact, as of now, there is no like and dislike. Every thing is rotuine

కాలమే అన్నింటికీ పరమౌషధం అని ఎక్కడో చదివినట్లు గుర్తు. ఏమో కాలమే మార్చాలి

ఓ బ్రమ్మీ చెప్పారు...

వంశీ గారూ..

అది ఏ సందర్బంలోనో తెలియజేయ లేదు.. మీ దగ్గర దానికి సంభందించిన లింకు ఏదైనా ఉన్నట్లైతే ఇక్కడ పారేయండి.

అజ్ఞాత చెప్పారు...

Except for you nobody can trace the reasons as to why you are like this, for sure. Donno, sometimes life becomes barren and thoughts cling to vacuity. I too have experienced such bouts of such mental ennui.
Rather than beating it down by taking some seemingly workable but superficial steps, you better reason it out well with yourself. Such a cathartic process enables you to root it out well.
Just hoping to see an exuberant post from you soon (as always). Goodluck.
you just asked for the reasons. But i went a little further and suggested something. Don't get mad at me if you don't like that.

రిషి చెప్పారు...

చక్రవర్తి గారూ, వద్దు అసలిలాంటి అలోచనలమీద విశ్లేషణ చేయద్దు...చేసేకొద్దీ అవి బండరాళ్ళలా తయారవుతాయ్. ఇస్టమున్నా లేకపోయినా ఒక కామెడీ ( మంచివి) సినిమానో..ఒక మంచి పుస్తకమో ట్రయ్ చేయండి..డెఫినిట్ గా ఇలాంటి అలోచనలు, స్తబ్దత తగ్గుతాయ్.

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

కొద్దిగా ఓపికపడితే వచ్చేస్తారుగా వెనక్కి. ఇంత వైరాగ్యం దేనికి. ఇన్ని రోజుల తరువాత ధర్మపత్నిని కలిసే రాబోయే తీపి రోజులను తలచుకొని రోజులు గడిపేయండి.
విష్ యు గుడ్ లక్
- ఫద్మనాభం

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

వామ్మో ఇంత విరహతాపమా
కొద్ది రోజులలో ధర్మపత్నిని కలసుకోవడంలో ఉన్న ఆనందాన్ని తలచుకొని రోజులు గడిపేయండి
-పద్మనాభం

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

వామ్మో! ఇంత విరహ తాపమా?
రాబోయే "తీపి" రోజులను తలచుకుంటూ గడిపేయండి
- పద్మనాభం

మనోహర్ చెనికల చెప్పారు...

జిమ్ కారీ సినిమాలు చూడండి

 
Clicky Web Analytics